ICC Test Rankings: అగ్రస్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్.. కోహ్లీ స్థానంలో మార్పు లేదు..!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. బుధవారం విడుదల చేసిన ర్యాకింగ్స్‌లో కివీస్ సారథి 901 పాయింట్లతో తొలి స్థానం తిరిగి పొందగా, స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

ICC Test Rankings: అగ్రస్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్.. కోహ్లీ స్థానంలో మార్పు లేదు..!
Kane Williamson
Follow us

|

Updated on: Jun 30, 2021 | 4:09 PM

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. బుధవారం విడుదల చేసిన ర్యాకింగ్స్‌లో కివీస్ సారథి 901 పాయింట్లతో తొలి స్థానం తిరిగి పొందగా, స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. భారత్‌ తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో 30 ఏళ్ల కేన్ విలియమ్సన్‌ 49*, 52 పరుగులతో 900 పాయింట్ల మార్కును అధిగమించాడు. స్టీవ్ స్మిత్ (891 రేటింగ్ పాయింట్లు) పై 10 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించాడు. రెండు వారాల క్రితం స్మిత్‌తో అగ్రస్థానంలో నిలిచిన విలియమ్సన్.. 2015 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. మరలా ఇన్నాళ్లకు అగ్రస్థానానికి చేరుకున్నాడు. రాస్ టేలర్ మూడు స్థానాలు ఎగబాకి 14 వ స్థానానికి చేరుకోగా, ఎడమచేతి వాటం డెవాన్ కాన్వే 42 వ స్థానానికి చేరుకున్నాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 812 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. రిషబ్ పంత్ ఒక స్థానం దిగజారి ఏడవ స్థానానికి పడిపోయాడు. అలాగే డేవిడ్ వార్నర్ 724 పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో నిలిచాడు.

బౌలింగ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా బౌలర్ 908 పాయింట్లతో అగ్రస్థానం చేరుకోగా, భారత్ స్పిన్నర్ అశ్విన్ 865 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టిమ్ సౌతీ 824 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. హజల్‌వుడ్, నీల్ వాగ్నెర్ వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నారు. గత వారం టెస్టుల్లో నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచిన రవీంద్ర జడేజా.. ప్రస్తుతం 377పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయాడు. బెన్‌స్టోక్‌ కూడా జడేజాతో సమానంగా నిలిచాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ 384 పాయింట్లతో అగ్రస్థానం సాదించాడు.

Also Read:

Team India: 24 ఏళ్లకే భారత జట్టులోకి వచ్చి.. అనూహ్యంగా నాలుగు నెలలకే వైదొలిగాడు.. అతడెవరంటే!

Hyderabad Cricket Association: వివాదాలకు అడ్డాగా మారిన హెచ్‌సీఏ..! అసలేం జరుగుతోంది..?