Hyderabad Cricket Association: వివాదాలకు అడ్డాగా మారిన హెచ్‌సీఏ..! అసలేం జరుగుతోంది..?

క్రికెట్ ని ప్రోత్సహించాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్... వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. క్రికెటర్లకు చేయూతనిస్తూ... వాళ్లను ప్రోత్సాహించాల్సిన అసోసియేషన్ పెద్దలు.. తమ పదవుల్ని కాపాడుకోడానికే పరిమితం అవుతున్నారు.

Hyderabad Cricket Association: వివాదాలకు అడ్డాగా మారిన హెచ్‌సీఏ..! అసలేం జరుగుతోంది..?
Hyderabad Cricket Association
Follow us
Venkata Chari

|

Updated on: Jun 30, 2021 | 3:05 PM

Hyderabad Cricket Association: క్రికెట్ ని ప్రోత్సహించాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్… వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. క్రికెటర్లకు చేయూతనిస్తూ… వాళ్లను ప్రోత్సాహించాల్సిన అసోసియేషన్ పెద్దలు.. తమ పదవుల్ని కాపాడుకోడానికే పరిమితం అవుతున్నారు. అలాంటి అసోసియేషన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇండియన్ టీమ్ మాజీ కెప్టేన్ అజారుద్దీన్ కి తిప్పలు తప్పట్లేదు. ప్రెసిడెంట్ గా ఎన్నికైన అజార్ కి.. సొంత ప్యానెలే చెక్ పెట్టే పనుల్లో ఉంది. అస్సలు హెచ్.సీ.ఏ.లో ఏం జరుగుతోంది. అజార్ పై తోటి అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు ఎందుకింత గుర్రుగా ఉన్నారు. తప్పు ఎవరిది. క్రికెట్ ను అభివృద్ధి చేయాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. అజారుద్దీన్ హెచ్.సీ.ఏ.లో ఏ ముహుర్తాన అడుగు పెట్టాడో గానీ.. అతనికి కష్టాలు మాత్రం తీరట్లేదు. నమ్ముకున్న వాళ్లే.. ఎప్పుడు వెన్ను పోటు పొడుస్తారో ఆయనకే తెలియట్లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియాకి కెప్టెన్ గా ఓ వెలుగు వెలిగిన అజారుద్దీన్ కి.. ఇప్పుడు హెచ్.సి.ఏ. లో జరుగుతున్న పరిణామాలు కొత్త తలనొప్పులు తేవడమే కాకుండా… తన పదవికే ఎసరు పెడుతున్నారు మిగతా అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హెచ్.సి.ఏ. పీఠమెక్కిన అజారుద్దీన్… కుర్చీ లో కూర్చున్నప్పట్నుండి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. క్రికెట్ ప్రోత్సాహం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తోటి అపెక్స్ కౌన్సిల్ మెంబర్లకూ మింగుడు పడట్లేదు. అజార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు అయిన వైస్ ప్రెసిడెంట్ జాన్ మానోజ్, సెక్రేటరీ విజయానంద్, జాయింట్ సెక్రేటరీ నరేశ్ శర్మ, ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ అనురాధ లు ఆయనతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబుడ్స్ మెన్ నియామకం, జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం 20 శాతం ప్రత్యేక ఫండ్ కేటాయించడం, కొత్త జిల్లాలకు అఫిలియేషన్ వంటి నిర్ణయాలు అజార్ తీసుకోవడంతో… బహిరంగంగానే అజార్ పై మండిపడ్డారు అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు.

ఏళ్లకి ఏళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉంటూ… క్రికెట్ ని అభివృద్ది చేయకపోవడం, ప్లేయర్ల సెలక్షన్స్ లో అవినీతీ ఆరోపణలు రావడం, బీసీసీఐ నుంచి వస్తున్న ఫండ్ ని మిస్యూజ్ చేస్తుండటం, పదుల సంఖ్యలో ఏసీబీ కేసుల్లో ఏ1, ఏ2 లుగా తోటీ సభ్యుల పేర్లు ఉండటంతో…. వారిపై అజార్ మండిపడటంతోనే గొడవలు, అంతర్గత కుమ్ములాటలు స్టార్ట్ అయ్యాయంటున్నారు మరికొందరు సభ్యులు. పదవులను, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంత వారిని ఆడించేందుకు చూస్తున్న అపెక్స్ కౌన్సిల్ మెంబర్లపై తరచూ అజార్ ఫైర్ అవ్వడం.. తాను ప్రెసిడెంట్ గా పదివిచేపట్టిన రెండేళ్లలోపే పి.ఎఫ్. ఇష్యూ,  ఇన్కమ్ ట్యాక్స్, జి.ఎస్టీ, ప్రభుత్వంతో ఉన్న గ్రౌండ్ లీజ్ వివాదం వంటివి క్లియర్ చేయడం తోటివారికి నచ్చట్లేదనేది బహిరంగ రహస్యమే. పదేళ్లకుపైగా హెచ్.సీ.ఏ.లో కొనసాగుతున్న వీరు చేయంది… త్వరలోనే అన్ని జిల్లాల్లోను హెచ్.సీ.ఏ.కి గ్రౌండ్స్ ని కూడా ఏర్పాడు చేస్తానంటున్నాడు అజార్.

దీంతో తమకి అజారుద్దీన్ ఎక్కడ అడ్డుగోడలా తయారు అవుతాడోనని… వివిధ అంశాలని పొందుపరుస్తూ… అజార్ కి షోకాజ్ నోటీస్ లు పంపించారు తోటి అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు. ఇందులో అజార్ పై ప్రధాన ఆరోపణల్లో ఒకటి దుబాయ్ లో జరిగిన టీ10 క్రికెట్ లీగ్ లో నార్తర్న్ వారియర్స్ జట్టుకు మెంటర్ గా ఉండటం. ఇది పూర్తిగా బీసీసీఐ గుర్తింపు లేని లీగ్ అనేది అపెక్స్ కౌన్సిల్ సభ్యుల వాదన. బీసీసీఐ కి కానీ… హెచ్.సి.ఏ. కి కానీ తెలపకపోవడం ద్వారా విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడని అతనికి జారీ చేసిన షోకాజ్ నోటీసులో పొందుపరిచారు. ఇదే కాకుండా అతని రిటైర్మెంట్ కు సంబంధించిన విషయాన్ని కూడా దాచారని నోటీస్ లో పేర్కొన్నారు.

దీంతోపాటు దిల్ షుక్ నగర్ లోని కెనరా బ్యాంక్ లో హెచ్.సీ.ఏ.కి  అకౌంట్ ఉంది. ప్రెసిడెంట్ అయిన తన పర్మీషన్ లేకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. బ్యాంక్ నుంచి ఎటువంటి లావాదేవీలు జరగకుండా చూడాలని బ్యాంక్ మేనేజర్ కి లెటర్ పెట్టడంతో రెగ్యులర్ గా చెల్లించే బకాయిలు అసోసియేషన్ చెల్లించలేక పోయిందని.. దీంతో అసోసియేషన్ కార్యకలాపాలకు అజార్ అడ్డుతగిలారని కూడా అపెక్స్ కౌన్సెల్ ఈ నోటీస్ లో పేర్కొంది. అంబుడ్స్ మెన్ నియామకం తదితర అంశాలలో అజారుద్దీన్ తన పవర్ ని మిస్ యూజ్ చేశాడని షోకాజ్ నోటీస్ లో పేర్కొన్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేంత వకు అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ పేర్కొంది. అజార్ స్థానంలో అధ్యక్షుడిగా… వైస్ ప్రెసిడెంట్ అయిన జాన్ మనోజ్ ని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమంచింది. వచ్చే నెల 18న ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి… అజార్ ని పర్మనెంట్ గా హెచ్.సీ.ఏ.లోకి రానివ్వకుండా చర్యలు తీసుకునేందుకు పావులు కదుపుతోంది అపెక్స్ కౌన్సిల్.

అయితే ఈ నోటీస్ పై అజార్ సైతం గాటుగా స్పందించాడు. దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్లుగా హెచ్.సి.ఏ. అపెక్స్ కౌన్సిల్ సభ్యుల తీరు ఉందని అజార్ ఫైర్ అయ్యాడు. ఏసీబీ కేసుల్లో ఉన్న అపెక్స్ కౌన్సిల్ మెంబర్లకి… తన సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం గానీ… పదవిని తీసేసే అధికారంగాని లేదంటున్నాడు. హెచ్.సీ.ఏ. అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు తనకు పంపించిన షోకాజ్ నోటీస్ చెల్లదని, అందులో అన్ని తప్పులే ఉన్నట్లు.. వారి మీదే అంబుడ్స్ మెన్ విచారణ జరుగుతుందంటున్నాడు. అంబుడ్స్ మెన్ నిర్ణయం తర్చాత అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై చర్యలు తానే తీసుకుంటానన్నాడు.

క్రికెట్ ని డెవలప్ చేయడం దేవుడెరుగు.. ఆయన ప్రెసిడెంట్ పదవి లో నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు. ఎన్నికల్లో తమ ప్యానెల్ గెలిచాక… అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లలో అజార్ కి అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూనే… అజార్ ని పక్కనపెట్టేందుకు పావులు కదుపుతున్నారు అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు. గతకొన్నేళ్లుగా హెచ్.సీ.ఏ.లో ఉన్న తమకు ఎక్కడ అడ్డుగోడలా మారుతాడోనని.. అజర్ సీటుకే ఎసరు పెడుతున్నారు. అజర్ అధ్యక్ష పదవితో పాటు హెచ్.సీ.ఏ. సభ్యత్వం కూడా రద్దు చెయ్యాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో అందరివాడుగా ఉన్న అజర్… ఈ పరిణామాలను ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి. మొత్తానికి‌ హైదరాబాద్ క్రికెట్ అభివృద్ది మాత్రం ఈ పరిణామాలతో మూలన పడుతుందని క్రికెట్ లవర్స్ ఆందోళన వ్యక్తం‌ చేస్తున్నారు.

Also Read:

HBD Sanath Jayasuriya: సనత్‌ జయసూర్య.. 44 బంతుల్లో 82 పరుగులు, 48 బంతుల్లో 100 పరుగులు, భారత్‌పై ట్రిపుల్ సెంచరీ! ఊచకోతకు కేరాఫ్ అడ్రస్..!

Tokyo Olympics 2021: బంగారు పతకంతోనే తిరిగొస్తా: తెలుగుతేజం పీవీ సింధు!

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా