Tokyo Olympics 2021: బంగారు పతకంతోనే తిరిగొస్తా: తెలుగుతేజం పీవీ సింధు!
ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాదించాలని ప్రతీ ప్లేయర్ అనుకుంటాడు. కానీ, కొంతమందికే అది సాధ్యమవుతుంది. మరికొందరు రజతం, వెండి పతకాలతో సరిపెట్టుకుంటుంటారు.
Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాదించాలని ప్రతీ ప్లేయర్ అనుకుంటాడు. కానీ, కొంతమందికే అది సాధ్యమవుతుంది. మరికొందరు రజతం, వెండి పతకాలతో సరిపెట్టుకుంటుంటారు. కానీ, వీరి ఆశ మాత్రం బంగారంపైనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్‌లు ఏళ్ల తరబడి ఒలింపిక్స్ కోసం సాధన చేస్తుంటారు. టోక్యో ఒలింపిక్స్ రూపంలో వారి కలను నిజం చేసుకునే రోజు వచ్చేసింది. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్ క్రీడలు కరోనాతో వాయిదాపడ్డాయి. ఈ ఏడాది 2021 లో జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి దాదాపు 100కి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇందులో భారత్ స్టార్ షట్లర్ తెలుగుతేజం పీవీ సింధు కూడా ఉన్నారు.
2016 లో జరిగిన రియో ఒలింపిక్స్ పీవీ సింధు రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. కరోలినా మారిన్ (స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్ ) చేతిలో ఓడి కొద్దిలో బంగారు పతకాన్ని మిస్ చేసుకుంది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం కచ్చితంగా బంగారు పతకాన్ని సాధిస్తానని ఘంటా పథంగా చెబుతోంది ఈ తెలుగు తేజం. “2016 గేమ్స్ కంటే ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ భిన్నంగా ఉండునున్నాయని, నాపై ఎన్నో అంచనాలు ఉన్నాయని తెలుసు, ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానని” పేర్కొంది. అయితే ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్పెయిన్ దిగ్గజం కరోలినా మారిన్ గాయం కారణంగా దూరమైంది. దీంతో సింధు ఫేవరేట్‌గా మారనుందని పలువురు అంటున్నారు.
‘ఇలాంటి ఈవెంట్‌కు వెళ్తున్నానంటే.. పతకంతో తిరిగొస్తాననే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. పతకం కోసం చాలా కష్టపడాలి. ఆటపై ఫోకస్ చేయడం ద్వారానే ఈ అంచనాలతో వచ్చిన ఒత్తిడిని తట్టుకోగలను. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంతో కష్టపడాలి. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధించడమే ఈ సారి నాడ్రీమ్. కొరియన్ కోచ్ పార్క్ టే సాంగ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. టోక్యోలో ఉండే పరిస్థితుల మధ్యే ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రతి రోజు నేను వేర్వేరు భాగస్వాములతో ప్రాక్టీస్ చేస్తున్నాను. నా శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని పీవీ సింధు వెల్లడించింది.
మరోవైపు పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. జులై లో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో భారత పతాకాధారిగా భారత బృందాన్ని నడిపించే అవకాశం దక్కనుంది. ఈ సారి ఇద్దరు భారత పతావాధారులుగా వ్యవహరించనున్నారు. పురుషుల నుంచి ఒకరు, మహిళల నుంచి ఒకరిని ఎన్నుకోనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Also Read:
INDW vs ENGW: ఒత్తిడిలో భారత మహిళలు.. నేడు ఇంగ్లండ్‌తో రెండో వన్డే!
NewZealand: ఓ చిన్నారికి అండగా న్యూజిలాండ్ బౌలర్.. డబ్ల్యూటీసీ జెర్సీ వేలం!
Floyd Mayweather: అమెరికన్ బాక్సర్ ఓ ఫేక్ ఫైట్‌తో ఒక్క రోజులో ఎంత సంపాదించాడో తెలుసా…!