NewZealand: ఓ చిన్నారికి అండగా న్యూజిలాండ్ బౌలర్.. డబ్ల్యూటీసీ జెర్సీ వేలం!

ఓ చిన్నారి ఆదుకునేందుకు న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ రంగంలోకి దిగాడు. క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆ ఎనిమిదేళ్ల చిన్నారిని కాపాడేందుకు ముందుకొచ్చాడు.

NewZealand: ఓ చిన్నారికి అండగా న్యూజిలాండ్ బౌలర్.. డబ్ల్యూటీసీ జెర్సీ వేలం!
Tim Southee
Follow us

|

Updated on: Jun 30, 2021 | 9:43 AM

NewZealand: ఓ చిన్నారి ఆదుకునేందుకు న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ రంగంలోకి దిగాడు. క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆ ఎనిమిదేళ్ల చిన్నారిని కాపాడేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ధరించిన తన జెర్సీని వేలానికి పెట్టాడు. ఈ టీషర్ట్‌పై న్యూజిలాండ్ ప్లేయర్లంతా తమ సంతాలను చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎనిమిదేళ్ల చిన్నారి హోలీ బెట్టీ.. నాలుగేళ్లుగా న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతోంది. ఇన్నేళ్ల నుంచి ఆ చిన్నారికి అండగా నిలుస్తూ.. తనక తోచిన సహాయాన్ని అందిస్తున్నాడు. తాజాగా జెర్సీని వేలానికి పెట్టి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. ఈమేరక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చాడు. ‘హాయ్‌ గాయ్స్‌, చిన్నారి హోలీ కోసం డబ్ల్యూటీసీ జెర్సీని వేలం వేస్తున్నాను. ఈవేలంలో వచ్చే డబ్బు మొత్తం ఆ చిన్నారి కుటుంబానికి అందిస్తాను. రెండేళ్ల క్రితం హోలీ బెట్టీ గురించి తెలిసింది. 2018 నుంచి తనకు అండగా ఉంటూనే ఉన్నాను’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.

‘ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు జెర్సీని వేలం వేయాలిని అనుకున్నాను. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆ చిన్నారి కోసం ఏదైనా చేయాలని అనిపించింది. మీరు వేసే బిడ్‌ ఎంతైనా అభినందనీయమే’ అని కివీస్ బౌలర్ పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా చికిత్స పొందుతున్నా.. ఆ చిన్నారి పూర్తిగా కోలుకోలేదు. హోలీ బెట్టీ ప్రస్తుతం స్పెయిన్‌లో వైద్యం తీసుకొంటోంది. ఈమేరకు అభిమానులు టిమ్ సౌథీని పొగడ్తలతో ముంచెత్తారు. నువ్ లెజెండ్ బ్రో.. అంటూ కొందరు, ఓమంచి పని కోసం ఇలా చేస్తున్నందుకు నువ్ గ్రేట్ అంటూ మరికొందరు కామెంట్ చేశారు.

టిమ్ సౌథీ ఇప్పటి వరకు 79 టెస్టులు ఆడి 314 వికెట్లు సాధించాడు. అలాగే 143 వన్డేలు ఆడి 190 వికెట్లు పడగొట్టాడు. ఇక పొట్టి క్రికెట్‌లో 83 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీస్ బౌలర్ 99 వికెట్లను పడగొట్టాడు. న్యూజిలాండ్ తరపున అగ్రశ్రేణి బౌలర్‌గా రాణిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Tim Southee (@tim_southee)

Also Read:

Floyd Mayweather: అమెరికన్ బాక్సర్ ఓ ఫేక్ ఫైట్‌తో ఒక్క రోజులో ఎంత సంపాదించాడో తెలుసా…!

Wimbledon 2021 Day 2 Highlights: రెండో రౌండ్‌కు చేరిన ఫెదరర్‌, వీనస్.. గాయంతో తప్పుకున్న సెరెనా విలియమ్స్‌!