యూఏఈ లోనే టీ20 వరల్డ్ కప్..భారత్ నుంచి యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ:T20 World Cup video.
T20 World Cup: టీ20 ప్రపంచకప్ టోర్నీని ఐసీసీ మంగళవారం ట్విటర్ వేదికగా ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు పొట్టి ప్రపంచ కప్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీని యూఏఈతో ఒమన్‌లో నిర్వహించనున్నట్లు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీని యూఏఈతో ఒమన్‌లో నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తో పొట్టి ప్రపంచ కప్ వేదికను మార్చాల్సి వచ్చింది. అయితే, యూఏఈలో నిర్వహించే టీ20 ప్రపంచ కప్ బీసీసీఐ ఆతిథ్యంలోనే జరుగనుందని ఐసీసీ స్పష్టం చేసింది.మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ద షేక్ జాయెద్ స్టేడియం(అబుదాబి), షార్జా స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. తొలి రౌండ్‌లో అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోతాయని పేర్కొంది. ఒమన్, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులుగా మ్యాచ్‌లు ఆడతాయని పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి: లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked
పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.