Wimbledon 2021 Day 2 Highlights: రెండో రౌండ్‌కు చేరిన ఫెదరర్, వీనస్.. గాయంతో తప్పుకున్న సెరెనా విలియమ్స్!
వింబుల్డన్‌లో రెండో రోజు పోటీల్లో స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ రోజర్, అమెరికా దిగ్గజ ప్లేయర్ వీనస్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మరో అమెరికా ప్లేయర్ సెరెనా మాత్రం గాయంతో టోర్నీ నుంచి తప్పుకుంది.
Wimbledon 2021 Day 2 Highlights: వింబుల్డన్‌లో రెండో రోజు పోటీల్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ విజయం సాధించి, రెండో రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు. అయితే విజయం మాత్రం చాలా కష్టంగా లభించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ప్రపంచ 41వ ర్యాంకర్ మన్నారినో నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. మ్యాచ్‌లో ఫెదరర్ 6-4, 6-7 (3-7), 3-6, 6-2తో ఉండగా మన్నారినో గాయంతో ఆట నుంచి తప్పుకున్నాడు. దీంతో ఫెదరర్‌కు లక్ కలిసి వచ్చినట్లైంది. తొలి సెట్ లో ఫెదరర్ గెలవగా, తర్వాతి రెండు సెట్లలో మన్నారినో పుంజుకుని స్విట్జర్లాండ్ స్టార్‌పై ముందజంలో నిలిచాడు. మరలా ఫెదరర్ నిలదొక్కుకుని ఆధిక్యంలో నిలిచాడు. ఈ సమయంలో మన్నారినో కోర్టులో జారిపడటంతో అతని మోకాలికి గాయమైంది. మన్నారినో గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో ఫెదరర్ విజయం సాధించినట్లు ప్రకటించారు. మ్యాచ్‌లో ఫెదరర్ 16 ఏస్‌లు కొట్టాడు. మరో మ్యాచ్‌లో జర్మనీ ప్లేయర్ 4వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. అలాగే అర్జెంటీనా ప్లేయర్ 9వ సీడ్ ష్వార్జ్‌మాన్ తొలి రౌండ్ గట్టెక్కాడు. అతడు 6-3, 6-4, 6-0తో ఫ్రాన్స్ ఆటగాడు పైర్ పై విజయం సాధించి రెండో రౌండ్లో కి ఎంటరయ్యాడు. మరో మ్యాచ్‌లో బ్రిటన్ ప్లేయర్ ఆండీ ముర్రే 6-4, 6-3, 5-7, 6-3తో జార్జియా ప్లేయర్ బసిలష్విలి పై విజయం సాధించాడు.
ఇక మహిళల విభాగంలో టాప్ సీడ్ ఆష్లే బార్టీ 6-1, 6-7 (1-7), 6-1తో స్పెయిన్ ప్లేయర్ నవారో పై గెలచి రోండో రౌండ్‌లోకి ప్రవేశించింది. జర్మనీ ప్లేయర్ కెర్బర్, చెక్ ప్లేయర్ ప్లిస్కోవా లు కూడా తమ తొలి రౌండ్‌ను పూర్తి చేశారు. కెర్బర్ 6-4, 6-3తో సెర్బియా ప్లేయర్ స్టొజనోవిచ్ పై విజయం సాధించగా, 8వ సీడ్ ప్లిస్కోవా 7-5, 6-4తో స్లొవేనియా జిదాన్‌సెక్ పై గెలిచి రెండో రౌండ్లోకి ఎంటర్ అయ్యారు. అలాగే అమెరికా స్టార్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ 7-5, 4-6, 6-3తో రొమేనియా ప్లేయర్ బుజార్నెస్కూ పై అలవోకగా గెలిచి తరువాతి రౌండ్‌కు ఎంటర్ అయింది. గ్రీస్ ప్లేయర్ సకారి 6-1, 6-1తో నెదర్లాండ్ ప్లేయర్ అరాంటా రుస్ విజయం సాధించి నెక్ట్ లెవల్‌కు చేరింది. మరో అమెరికా టెన్నిస్ స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ తొలి రౌండ్‌లోనే గాయం కారణంగా వెనుదిరిగింది. బెలారస్ ప్లేయర్ అలెక్సాండ్రా సస్నోవిచ్ తో తలపడున్న సమయంలో చీలమండ గాయం కారణంగా సెరెనా ఆట నుంచి తప్పుకుంది.
Wishing you a speedy recovery, @serenawilliams#Wimbledon
— Wimbledon (@Wimbledon) June 29, 2021
Also Read: