Wimbledon 2021 Day 1 Highlights: గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్‌కు ఊహించని ఫలితం; జకోవిచ్, సబలెంక శుభారంభం!

వింబుల్డన్‌ ప్రారంభమైన తొలి రోజే సంచలనంగా మారింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనలిస్ట్‌ సిట్సిపాస్‌కు ఊహించని షాక్ తగిలింది.

Venkata Chari

|

Updated on: Jun 29, 2021 | 8:56 AM

వింబుల్డన్‌  ప్రారంభమైన తొలి రోజే సంచలనంగా మారింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనలిస్ట్‌ సిట్సిపాస్‌కు ఊహించని షాక్ తగిలింది. తియోఫె తొలి రౌండ్లోనే ఈ యంగ్ ఆటగాడికి చెక్‌ పెట్టాడు. అలాగే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌, మహిళల సింగిల్స్‌లో సబలెంక ముందడుగు వేశారు.

1 / 5
ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓడిపోయిన గ్రీసు యువకెరటం సిట్సిపాస్‌... అందరి మనసులు గెలుచుకున్నాడు. అయితే తొలి రోజు వింబుల్డన్‌లో ఈ గ్రీస్ ప్లేయర్‌కు షాక్ తగిలింది. అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్‌ తియోఫె 6-4, 6-4, 6-3తో రెండో సీడ్‌ సిట్సిపాస్‌ పోరాడి ఓడిపోయాడు. మ్యాచ్‌లో సిట్సిపాస్‌ 15 ఏస్‌లు కొట్టగా.. తియోఫె 7 ఏస్‌లు కొట్టారు. సిట్సిపాస్‌ 35 విన్నర్లు, తియోపె 43 విన్నర్లు కొట్టారు.

2 / 5
ఇక టైటిల్‌ ఫేవరెట్‌ గా బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌.. రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మొదటి రౌండ్లో 4-6, 6-1, 6-2, 6-2తో బ్రిటన్‌కు చెందిన 243వ ర్యాంకు ఆటగాడు జాక్‌ డ్రేపర్‌పై గెలిచాడు. పదునైన సర్వీసులతో చెలరేగిన 25 ఏస్‌లతో పాటు 47 విన్నర్లు కొట్టాడు.

3 / 5
మరో మ్యాచ్‌లో ఆండీ ముర్రే 6-4, 6-3, 5-7, 6-3 తేడాతో నికోలోజ్ బసిలాష్విలిని ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.

4 / 5
మహిళల సింగిల్స్‌లో 10వ సీడ్‌ క్విటోవా 3-6, 4-6తో స్టీఫెన్స్‌తో చేతిలో పరాజయం పాలైంది. రెండో సీడ్‌ సబలెంక తొలి రౌండ్లో 6-1, 6-4తో నికులెస్కు ను ఓడించింది. 7వ సీడ్‌ స్వైటెక్‌, ముగురుజ, కీస్‌ కూడా రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు.

5 / 5
Follow us