AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs ENGW: ఒత్తిడిలో భారత మహిళలు.. నేడు ఇంగ్లండ్‌తో రెండో వన్డే!

ఇంగ్లండ్‌ జట్టుతో ఏకైక వన్డే సిరీస్‌ ను డ్రా చేసుకున్న భారత మహిళలు.. వన్డే సిరీస్‌లో మాత్రం తేలిపోతున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగం జరిగిన మొదటి వన్డేలో ఘోర పరాజయం పాలయ్యారు.

INDW vs ENGW: ఒత్తిడిలో భారత మహిళలు.. నేడు ఇంగ్లండ్‌తో రెండో వన్డే!
Indwvseng
Venkata Chari
|

Updated on: Jun 30, 2021 | 1:42 PM

Share

INDW vs ENGW: ఇంగ్లండ్‌ జట్టుతో ఏకైక వన్డే సిరీస్‌ ను డ్రా చేసుకున్న భారత మహిళలు.. వన్డే సిరీస్‌లో మాత్రం తేలిపోతున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగం జరిగిన మొదటి వన్డేలో ఘోర పరాజయం పాలయ్యారు. కాగా, నేడు జరగనున్న రెండో వన్డేలో చావోరేవో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. బ్యాటింగ్‌లో ఒకరిద్దరు రాణిస్తున్నా.. మిగతా వారు మాత్రం త్వరగా పెవిలియన్ చేరి నిరాశపరుస్తున్నారు. బౌలింగ్‌లోనూ విఫలం కావడంతో తీవ్రమైన ఒత్తిడిలో నేడు రెండో వన్డే ఆడనుంది మిథాలీ సేన. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు నిలుపుకొంటోంది. ఓడితే మాత్రం సిరీస్‌ కోల్పోయినట్లే. 0-1తో వెనుకంజలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతారో చూడాలి. మొదటి వన్డేలో కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించింది. అయినా మిడిల్ ఆర్డర్‌, ఓపెనర్లు రాణించకపోవడంతో భారీ స్కోర్ చేయలేక పోయింది. గత మ్యాచ్‌ల్లోనూ 200 లోపే స్కోర్లు నమోదవ్వడం గమనార్హం. బ్యాటింగ్‌లో మిథాలీకి తోడు పూనమ్‌ రౌత్‌, దీప్తి శర్మ మాత్రమే బ్యాట్ ఝలిపిస్తున్నారు. షెఫాలీ వర్మ, స్మృతి మంథాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లాంటి స్టార్లు ఇంకా తమ బ్యాట్‌కు పదును పెట్టలేదు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌లో చోటు దక్కాలంటే ఈ సిరీస్‌లో ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని రంగాల్లో రాణిస్తేనే చోటు దక్కనుంది.

ఈ మ్యాచ్‌ ఫైనల్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూనమ్ రౌత్ ప్లేస్‌లో జెమీమా రొడ్రిగ్స్ రెండో వన్డేలో ఆడొచ్చనే టాక్ వినిపిస్తోంది. బ్యాటింగ్ లో హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ, తానియా భాటియా రాణించి భారీ స్కోర్ చేయాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో జులన్ గోస్వామి వికెట్లు తీయకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. హైదరాబాదీ అరుంధతి రెడ్డి, ఏక్తా బిష్త్ లు కూడా వికెట్లను సాధించలేక భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈమేరకు ఈ మ్యాచ్‌లో వికెట్ వేట కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంగ్లండ్ అన్ని రంగాల్లో బలంగా తయారైంది.

భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఈ మ్యాచ్ సాయంత్ర 6.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సోనీ టెన్-1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఇండియా ప్లేయింగ్ లెవన్: షఫాలి వర్మ, స్మృతి మంధనా, జెమిమా రోడ్రిగ్స్ / ప్రియా పునియా, మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ రానా / శిఖా పాండే, పూజ వస్త్రకర్, తానియా భాటియా (కీపర్), జులాన్ గోవామ్

ఇంగ్లండ్ ప్లేయింగ్ లెవన్: టామీ బ్యూమాంట్, లారెన్ విన్ఫీల్డ్-హిల్, హీథర్ నైట్, నాట్ సైవర్, అమీ జోన్స్ (కీపర్), సోఫియా డంక్లే, కేథరీన్ బ్రంట్, సారా గ్లెన్, సోఫీ ఎక్లెస్టోన్, అన్య ష్రబ్‌సోల్, కేట్ క్రాస్

Also Read:

NewZealand: ఓ చిన్నారికి అండగా న్యూజిలాండ్ బౌలర్.. డబ్ల్యూటీసీ జెర్సీ వేలం!

Floyd Mayweather: అమెరికన్ బాక్సర్ ఓ ఫేక్ ఫైట్‌తో ఒక్క రోజులో ఎంత సంపాదించాడో తెలుసా…!