Viral Photo: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

Leopard Viral Pic: పైన పేర్కొన్న ఫోటోలో రెండో చిరుతపులి ఎక్కడ దాగి ఉందో.! కనిపెట్టేందుకు జనాలు తమ మెదడుకు పని చెబుతున్నారు. ఇక ఆ ఫోటోలో దాగున్న చిరుతను…

Viral Photo: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..
Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 28, 2021 | 11:58 AM

అసలే లాక్‌డౌన్.. ఆపై వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో.. జనాలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో ఇంటర్నెట్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తరచుగా వచ్చే పజిల్స్, ఛాలెంజ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దలు వరకు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫోటో పజిల్స్ అయితే బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఓ పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పైన పేర్కొన్న ఫోటోలో రెండో చిరుతపులి ఎక్కడ దాగి ఉందో.! కనిపెట్టేందుకు జనాలు తమ మెదడుకు పని చెబుతున్నారు. ఇక ఆ ఫోటోలో దాగున్న చిరుతను గుర్తించేందుకు నెటిజన్లు పెద్ద సవాల్‌ను ఎదుర్కుంటున్నారు.

ఈ ఫోటో ఫోటోషాప్ మ్యాజిక్ అనుకుంటే పొరపాటే.! మోహన్ థామస్ అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ తీసిన ఈ ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కశ్వన్ ట్విట్టర్‌లో రీ-పోస్ట్ చేశారు. ఓ చిరుతపులి ఎంచక్కా చెట్టుపైన కూర్చుని సేద తీరుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇందులో చిరుత ఒక్కటే లేదు. చిరుత పిల్ల కూడా దాగుంది. ఫొటోలో దాన్ని కనిపెట్టాలి. నెటిజన్లు మొదటిసారిగా ఈ ఫోటోను చూస్తే.. అది సర్వసాధారణంగా కనిపిస్తుంది. దాని ప్రత్యేకత కూడా ఎవ్వరికీ తెలియదు.

అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో బుల్లి చిరుత పిల్ల  ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ చిరుతను గుర్తించేందుకు చాలామంది ప్రయత్నించారు. కానీ చివరికి ఫెయిల్ అయ్యారు. కొంతమంది అయితే.. ఈ ఫోటో మరో చిరుత ఉన్నట్లు భ్రమ కల్పిస్తోందని కామెంట్స్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ వైరల్ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఈ ఫోటోలోని చిరుత పిల్లను కనుగొంటారా.? లేదా.? ట్రై చేయండి.

క్లూ: మీకో చిన్న క్లూ..ఏకాగ్రతతో ఫోటోను చూస్తే.. మీకు రెండు తోకలు కనిపిస్తాయి. చెట్టు మధ్యలో పరిశీలిస్తే సులభంగా బుల్లి చిరుతపిల్లను గుర్తించవచ్చు.

ఇది చదవండి: ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?