Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shoaib Akhtar’s son Dance: ఆమిర్ ఖాన్ పాటకు షోయబ్ అక్తర్ తనయుడు డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Shoaib Akhtar’s son Dance: పాకిస్తాన్‌లో బాలీవుడ్ సినిమాలకు విపరీతమై క్రేజ్ ఉంటుంది. ఇండియాలో రిలీజ్ అయిన ప్రతీ బాలీవుడ్ సినిమా..

Shoaib Akhtar’s son Dance: ఆమిర్ ఖాన్ పాటకు షోయబ్ అక్తర్ తనయుడు డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Viral Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 30, 2021 | 4:32 PM

Shoaib Akhtar’s son Dance: పాకిస్తాన్‌లో బాలీవుడ్ సినిమాలకు విపరీతమై క్రేజ్ ఉంటుంది. ఇండియాలో రిలీజ్ అయిన ప్రతీ బాలీవుడ్ సినిమా పాకిస్తాన్‌లోనూ విడుదల అవుతుంది. బాలీవుడ్ హీరో, హీరోయిన్లకు పాకిస్తాన్‌లో అభిమానులు చాలానే ఉన్నారు. అలాగే పాకిస్తాన్‌కు చెందిన నటీనటులు కూడా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు.

ఇదిలాఉంటే.. పాకిస్తా్న్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కొడుకు కూడా బాలీవుడ్ స్టార్స్‌ ఆమిర్ ఖాన్‌కి పెద్ద ఫ్యాన్ అనే విషయం మీకు తెలుసా? షోయబ్ అక్తర్ స్వయంగా ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రమ్‌లో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమిర్ ఖాన్ నటించిన ‘తారే జమీన్ పాజ్’ సినిమాలోని ‘బమ్ బమ్ బోలే’ పాటకు అక్తర్ కొడుకు డ్యాన్స్ చేశాడు. అంతేకాదు.. ఆ పాట వింటూ తెగ ఆనందపడిపోయాడు. ఆమిర్ ఖాన్ పాటకు తన కొడుకు డ్యాన్స్ చేస్తుండగా వీడియో తీసిన అక్తర్.. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు వీడియోను 80 వేల సార్లు వీక్షించారు. అక్తర్ తనయుడి డ్యాన్స్‌కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. డ్యాన్స్‌కు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Women protest : తన భూమికి పట్టా చేయాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి.. తిరిగి, చివరికి తాళిబొట్టు కట్టింది

Brother kills Sister: చెల్లెల్లు తన మాట వినలేదని దారుణానికి ఒడిగట్టిన అన్న.. వ్యాట్సాప్ వీడియోలు చూస్తుందని నరికి చంపిన దుర్మార్గుడు!

ICC Test Rankings: అగ్రస్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్.. కోహ్లీ స్థానంలో మార్పు లేదు..!