Rohit Sharma: రోహిత్‌కు సారీ చెప్పిన అతడి భార్య రితిక… ఎందుకో తెలుసా ?
టీమ్ ఇండియా ప్లేయర్స్ ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగిశాక వారికి చాలా రోజుల గ్యాప్ దొరికింది. దీంతో కుటుంబ సభ్యులతో...
టీమ్ ఇండియా ప్లేయర్స్ ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగిశాక వారికి చాలా రోజుల గ్యాప్ దొరికింది. దీంతో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భార్య రితిక.. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ బూమరాంగ్ వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె రోహిత్‌కు క్షమాపణలు చెబుతూ కనిపించింది. ఈ వీడియోలో రోహిత్ ఏదో ప్రకటన కోసం షూటింగ్‌లో ఉండగా .. ఆ రూమ్‌లోనే వారి పెట్ డాగ్ కూడా పడుకుని ఉంది. ఈ రెండింటిని పోల్చుతూ సారీ రో.. నీవు ఇక ఏ మాత్రం క్యూట్ కాదు అంటూ ఆమె క్యాప్షన్ జోడించింది. కాగా ప్రస్తుత విరామం తర్వాత ఆగస్టులో ఇంగ్లాండ్‌తో భారత క్రికెట్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
కెప్టెన్సీ విభజనపై చర్చ
న్యూజిలాండ్‌తో సౌథాంప్టన్ వేదికగా ఇటీవల ముగిసిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ జట్టు అంచనాల్ని అందుకోలేకపోయింది. ఫైనల్ టీమ్ ఎంపిక నుంచి భారత బౌలర్ల వినియోగం వరకూ కోహ్లీ సారథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో.. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకి టీమ్ పగ్గాలు ఇవ్వాలని కొంత మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ నుంచి ఈ కెప్టెన్సీ విభజనపై చర్చ జరుగుతుండగా.. ఇప్పుడు ఇప్పడది పీక్ లెవల్‌కు చేరింది. టీమిండియా కెప్టెన్సీ విభజనపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెటర్ కెప్టెన్ అని తన పర్సనల్ ఫీలింగ్ అని చెప్పుకొచ్చాడు. 2018 ఆసియా కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీని గమనించానని.. ఆ టోర్నీకి కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ.. చాలా సహజసిద్ధంగా మైదానంలో టీమ్‌ని నడిపించాడని పేర్కొన్నాడు.
Also Read: సింగర్ సునీత మదిలో కొత్త ఆలోచన.. ఇకపై ఆమె అడుగులు అటువైపేనా..?