Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Revenge: బ్రాత్ వైట్ పై ఐదేళ్ల నాటి పగ తీర్చుకున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్..!

ఐదేళ్ల క్రితం పగను ఎట్టకేలకు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తీర్చుకున్నాడు. 2016 టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వైట్.. బెన్ స్టోక్స్ బౌలింగ్ లో వరుసగా నాలుగు సిక్సులు కొట్టి ఇంగ్లండ్ టీంకు కప్ ను దూరం చేశాడు.

T20 Revenge: బ్రాత్ వైట్ పై ఐదేళ్ల నాటి పగ తీర్చుకున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్..!
Ben Stokes Smashes Carlos Brathwaite
Follow us
Venkata Chari

|

Updated on: Jul 01, 2021 | 8:48 AM

T20 Revenge: ఐదేళ్ల క్రితం పగను ఎట్టకేలకు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తీర్చుకున్నాడు. 2016 టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వైట్.. బెన్ స్టోక్స్ బౌలింగ్ లో వరుసగా నాలుగు సిక్సులు కొట్టి ఇంగ్లండ్ టీంకు వరల్డ్ కప్ ను దూరం చేశాడు. దీంతో బెన్ స్టోక్స్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అప్పటి నుంచి ఓ అవకాశం ఎదురుచూస్తున్న ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్… టీ20 బ్లాస్ట్ రూపంలో రానే వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 2016 టీ 20 ప్రపంచ కప్ భారత్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీ ఫైనల్ లో వెస్టిండీస్, ఇంగ్లండ్ టీంలు తలపడ్డాయి. తుది పోరులో ఇంగ్లండ్ మొదటి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ లో జో రూట్‌(54), జోస్ బట్లర్‌(36), డేవిడ్‌ విల్లీ(21) ఆకట్టుకున్నారు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్‌ తలో 3 వికెట్లు తీసి, ఇంగ్లండ్ ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. అనంతరం 156 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్.. చివరి ఓవర్లో మరో రెండు బంతులుండగానే విజయం సాధించి, టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఈ విజయంతో రెండోసారి టీ20 విజేతగా అవతరించింది. అయితే వెస్టిండీస్ విజయానికి రెండు ఓవర్లలో 27 పరుగులు కావాలి. ఈ టైంలో ఇంగ్లాండ్ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ రంగంలోకి దిగాడు. ఈ ఓవర్లో జోర్డాన్ దెబ్బకు కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగారు వెస్టిండీస్ బ్యాట్స్ మెన్స్ శాముల్స్‌, బ్రాత్‌వైట్‌. ఇక చివరి ఓవర్‌లో వెస్టిండీస్ గెలవాలంటే 19 పరుగులు కావాలి. 20వ ఓవర్ ను బెన్ స్టోక్స్‌ వేసేందుకు సిద్ధమయ్యాడు. బ్రాత్ వైట్ వరుసగా నాలుగు భారీ సిక్సర్లుగా కొట్టడంతో… వెస్డిండీస్ అమోఘమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత వీరిద్దరు మరోసారి ఎదురుపడలేదు. బెన్ స్టోక్స్ ప్రతీకారం మాత్రం అలానే ఉండిపోయింది.

టీ20 బ్లాస్ట్ లీగ్‌లో వీరిద్దరు ఎదురుపడ్డారు. డర్హమ్‌ జట్టుకు స్టోక్స్.. వార్విక్‌షైర్‌ టీంలో బ్రాత్‌వైట్ ఆడుతున్నారు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్ లో బరిలోకి దిగిన బెన్ స్టోక్స్ .. బ్రాత్ వైట్ బౌలింగ్ కోసం ఎదురుచూశాడు. ఆ సందర్భం రానే వచ్చింది. దీంతో బ్రాత్ వైట్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సులు, ఫోర్ బాదేశాడు. దీంతో కొంతైనా తన పగ చల్లార్చుకున్నాడు ఈ ఇంగ్లీష్ ఆల్ రౌండర్. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. డర్హమ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వార్విక్‌షైర్‌ జట్టు కేవలం 18.3 ఓవర్లలోనే ఆలౌటైంది. ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేయడంతో… ఇంగ్లాండ్ అభిమానులు కామెంట్లతో బెన్ స్టోక్స్ ను అభినందించారు. మొత్తంగా కాకపోయినా.. కొద్దగినైనా పగతీర్చుకున్నావంటూ కామెంట్లు చేశారు. మరోసారి బెన్ స్టోక్స్ ఫామ్ లోకి వచ్చాడంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.

Also Read:

Wimbledon 2021 Day 3 Highlights: సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్, సబలెంకా ముందడుగు; కెనిన్, అండ్రస్కూ, బెన్ చిచ్ ఓటమి

Saina Nehwal: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ నెమలితో చెలిమి.. వైరల్ అయిన వీడియో