Singer Sunitha: సింగ‌ర్ సునీత మ‌దిలో కొత్త ఆలోచ‌న‌.. ఇక‌పై ఆమె అడుగులు అటువైపేనా..?

ఇటీవ‌లే దాంప‌త్య జీవితంలోకి అడుగుపెట్టిన సింగ‌ర్ సునీత‌... త‌న ప్రొఫిష‌న‌ల్ లైఫ్‌లో మ‌రో ట‌ర్న్ తీసుకోబోతున్నారా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తుంది. ఇటీవ‌ల ​బిజినెస్ మ్యాన్...

Singer Sunitha: సింగ‌ర్ సునీత మ‌దిలో కొత్త ఆలోచ‌న‌.. ఇక‌పై ఆమె అడుగులు అటువైపేనా..?
Singer Sunitha
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 30, 2021 | 5:24 PM

ఇటీవ‌లే దాంప‌త్య జీవితంలోకి అడుగుపెట్టిన సింగ‌ర్ సునీత‌… త‌న ప్రొఫిష‌న‌ల్ లైఫ్‌లో మ‌రో ట‌ర్న్ తీసుకోబోతున్నారా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తుంది. ఇటీవ‌ల ​బిజినెస్ మ్యాన్ రామ్​ వీరపనేనిని వివాహం చేసుకున్న ఈమె.. త్వరలో ఆయనతో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాంగో సంస్థల అధినేత రామ్.. ‘ఏక్​మినీ కథ’ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించారు. త్వరలోనే ఓ వెబ్​సిరీస్​ను రూపొందించాలని ఆయ‌న ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే దీనికి సంబంధించిన బాధ్యతల్ని సునీత స్వయంగా పర్యవేక్షించనున్నారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. సునీత త‌న మ‌ధుర‌మైన గాత్రంతో తెలుగులో ఎన్నో హిట్​పాటలు పాడి శ్రోతల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. ప్లేబ్యాక్​ సింగర్​గానే కాకుండానే యాంకర్​గా, డబ్బింగ్​ ఆర్టిస్ట్​గా త‌న‌లోని టాలెంట్ చూపించారు. సౌందర్య నుంచి మొద‌లుపెడితే ప్ర‌ముఖ హీరోయిన్స్ స్నేహ, ఇలియానా, త్రిష, సోనాలి బింద్రే, కమలినీ ముఖర్జీ, జెనీలియా, ఇలియానా, త్రిష, కత్రినా కైఫ్​లాంటి ఎంద‌రో స్టార్ హీరోయిన్స్‌కు డబ్బింగ్ చెప్పారు.

కాగా కాలేజీలో చదివే రోజుల్లోనే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాలని ఆలోచన వచ్చినట్లు గాయని సునీత ఇటీవ‌ల తెలిపారు. గుంటూరు కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలామంది కుర్రాళ్లు ఫాలో అయ్యేవారని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అయితే పాఠశాల చదువుల నుంచే సంగీతంతో పాటు ఖాళీ సమయాల్లో కాంపిటీషన్లుకు సిద్ధం చేయడం తప్ప, అల్లరి చేసే అవకాశం తన పేరెంట్స్​ ఇవ్వలేదని చెప్పారు. ‘గులాబీ’ సినిమాలో ‘ఈ వేళలో నీవు సాంగ్‌తో సునీత చిత్రాల‌కు పాట‌లు పాడ‌టం ప్రారంభించింది.

Also Read: డొంకకు పెట్టిన మంట పెళ్లి ఇంటికి చేరింది.. చివ‌ర‌కు బుగ్గే మిగిలింది

 విఘ్నేష్‌ శివన్ కంటే న‌య‌న‌తార వ‌య‌స్సులో ఎంత పెద్ద‌దో తెలుసా..?