Covishield Vaccine: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొవిషీల్డ్‌ రెండో డోసు వ్యవధిని పెంచుతూ నిర్ణయం

Covishield Vaccine: కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకోవాల్సిన కనీస వ్యవధిని పెంచుతూ తెలగాణ రాష్ట్ర ప్రభుత్వం..

Covishield Vaccine: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొవిషీల్డ్‌ రెండో డోసు వ్యవధిని పెంచుతూ నిర్ణయం
Covishield
Follow us
Subhash Goud

|

Updated on: Jul 01, 2021 | 5:54 AM

Covishield Vaccine: కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకోవాల్సిన కనీస వ్యవధిని పెంచుతూ తెలగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. మొదటి, రెండో డోసుల మధ్య కనీస వ్యవధి 84 రోజుల నుంచి 98 రోజులకు పెంచింది. ఇక నుంచి 98 నుంచి 112 రోజుల మధ్య సెకండ్‌ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను పాటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు సొంత నిర్ణయం తీసుకుంది. జూలైలో దాదాపు 30 లక్షల మంది కొవిషీల్డ్‌ సెకండ్‌ డోసు తీసుకోవాల్సి ఉండగా, వ్యాక్సిన్‌ కొరతతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కనీసం ఒక్క డోసు వేసుకున్నా ఎంతో కొంత ఇమ్యూనిటీ వస్తుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇక నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందు కోసం హైదరాబాద్‌లో 100 టీకా కేంద్రాలు, ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మరో 204 వ్యాక్సిన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వ్యాక్సిన్‌ వేయనున్నట్టు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో అయితే కొవిన్‌ పోర్టల్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌తో సంబంధం లేకుండా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.

ఇవీ కూడా చదవండి:

Covid 19 vaccine: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం.. ఇప్పటివరకు 33 కోట్ల మందికి అందిన కోవిడ్ టీకా

CM Jagan Letter to PM: ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ.. ప్రైవేట్‌కు తగ్గించి ప్రభుత్వానికి వ్యాక్సిన్లను పెంచాలని విజ్ఞప్తి

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!