Lightning Strike: భద్రాది కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి.. గ్రామాల్లో విషాద ఛాయలు

Lightning Strike: పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. దుమ్ముగూడెం మండలం పరిధిలోని ఆంధ్రకేసరి నగర్‌ కాలనీ శివారులో..

Lightning Strike: భద్రాది కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి.. గ్రామాల్లో విషాద ఛాయలు
Lightning Strike
Follow us
Subhash Goud

|

Updated on: Jul 01, 2021 | 5:20 AM

Lightning Strike: పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. దుమ్ముగూడెం మండలం పరిధిలోని ఆంధ్రకేసరి నగర్‌ కాలనీ శివారులో బుధవారం పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. ఆంధ్రకేసరి నగర్‌ కాలనీకి చెందిన చాట్ల వీర్రాజు (45), శ్రీనగర్‌ కాలనీ గ్రామానికి చెందిన జుంజూరి భాస్కరరావు (50) దోమలవాగు సమీపంలో పశువులను మేపడానికి వెళ్లారు. అయితే సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వాగు పక్కనే వీరిద్దరితో పాటు మరి కొంత మంది వర్షంలో తడుస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఇంటికి చేరేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు వీరి పక్కనే పిడుగు పడింది.

దీంతో ఒక్కసారిగా వీర్రాజు, భాస్కరరావు పడిపోయారు. అపస్మారక స్థితికి చేరుకున్న వీరిని స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిరుపేద కుటుంబాలు కావడంతో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వీరి గ్రామాలు పక్కపక్కనే ఉండటంతో చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో వీరి మృతదేహాలను చూసేందుకు తరలి వచ్చారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇవీ కూాడా చదవండి:

బీటెక్‌ బాబు హైటెక్‌ మోసం..విశాఖలో లిక్కర్‌ డాన్‌..గోవా మద్యం విశాఖకు.. ఆన్‌లైన్‌లో పేమెంట్‌.. బయటపడ్డ నయా దందా

Liquor Transport : కోళ్ల వ్యర్ధాల మధ్యన మద్యం బాటిల్స్ తరలిస్తోన్న ముఠా గుట్టురట్టు

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!