South Central Railway: జూలై 1 నుంచి ఆరు ప్రత్యేక రైళ్లు రద్దు.. మరో నాలుగు ప్రత్యేక రైళ్లు కొనసాగింపు

South Central Railway: ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో ఆరు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖ- కాచిగూడ రైలును జూలై 1 నుంచి..

South Central Railway: జూలై 1 నుంచి ఆరు ప్రత్యేక రైళ్లు రద్దు.. మరో నాలుగు ప్రత్యేక రైళ్లు కొనసాగింపు
South Central Railway
Follow us
Subhash Goud

|

Updated on: Jul 01, 2021 | 5:31 AM

South Central Railway: ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో ఆరు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖ- కాచిగూడ రైలును జూలై 1 నుంచి 14వ తేదీ వరకు, కాచిగూడ- విశాఖ రైలును జూలై 2 నుంచి 15వ తేదీ వరకు, విశాఖ-కడప రైలును జూలై 1 నుంచి 14వ తేదీ వరకు, కడప-విశాఖ రైలును జూలై 2 నుంచి 15వ తేదీ వరకు, విశాఖ-లింగంపల్లి రైలును జూలై 1 నుంచి14వ తేదీ వరకు, లింగంపల్లి-విశాఖ రైలును జూలై 2 నుంచి 15 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. మరో వైపు ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-అగర్తల రైలు జూలై 5,12న, అగర్తల-సికింద్రాబాద్‌ రైలు జూలై 9,16న బయలుదేరుతాయి. అగర్తల-బెంగళూరు కంటోన్మెంట్‌ రైలు జూలై 6 నుంచి 24వ తేదీ వరకు ప్రతి మంగళవారం నడుస్తుందని తెలిపారు. బెంగళూరు కంటోన్మెంట్‌-అగర్తల రైలు జూలై 9 నుంచి 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

నేటి నుంచి మరో 45 ఎంఎంటీఎస్‌ సర్వీసులు

గురువారం నుంచి హైదరాబాద్‌లో మరో 45 ఎంఎంటీఎస్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో 12 రైలు సర్వీసులు, లింగంపల్లి-హైదరాబాద్‌ 12 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి వయా రామచంద్రాపురం మార్గంలో 16 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా వయా రామచంద్రాపురం మార్గంలో 15 సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఇప్పటికే 10 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నాయని వాటికి అదనంగా మరో 45 సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

ఇవీ కూడా చదవండి:

బీటెక్‌ బాబు హైటెక్‌ మోసం..విశాఖలో లిక్కర్‌ డాన్‌..గోవా మద్యం విశాఖకు.. ఆన్‌లైన్‌లో పేమెంట్‌.. బయటపడ్డ నయా దందా

ఎవరో ఆర్డర్‌ ఇస్తే వినాల్సిన అవసరం లేదు.. ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం