Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవరో ఆర్డర్‌ ఇస్తే వినాల్సిన అవసరం లేదు.. ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం

Telangana Minister Jagadish Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే..

ఎవరో ఆర్డర్‌ ఇస్తే వినాల్సిన అవసరం లేదు.. ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం
Telangana Minister Jagadish Reddy
Follow us
Subhash Goud

|

Updated on: Jun 30, 2021 | 10:46 PM

Telangana Minister Jagadish Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే బుధవారం ఏపీ కేబినెట్‌ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి ఉండాలని, ఇష్టానుసారంగా ఉత్పత్తి చేసుకుంటే కేఆర్‌ఎంబీ ఎందుకు ఉందని ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్‌ రెడ్డి స్పందించారు. జల విద్యుత్‌ ఉత్పత్తిని అపమనే హక్కు ఎవ్వరికి లేదని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో విద్యుత్‌ ఉత్పత్తి తెలంగాణ హక్కు, ఎవరో ఆర్డర్‌ ఇస్తే వినాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదన్నారు. కృష్ణా నదిలో మా వాట ఎంతో మాకు తెలుసు.. గతంలో చేసిన తప్పులనే ఏపీ నేతలు మళ్లీ చేస్తున్నారు అని మంత్రి జగదీష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వందశాతం సామర్థ్యంతో జల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో విద్యుత్‌ శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యుత్‌ ఉత్పత్తిలో జెన్‌కో అధికారులు వేగం పెంచారు. రాష్ట్రంలో జల విద్యుత్‌ ఉత్పత్తి ఒక్క రోజులోనే రెట్టింపైంది. సోమవారం 5.06 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి.. మంగళవారం నాటికి 11.12 మిలియన్‌ యూనిట్లకు చేరుకుందని అధికారులు వెల్లడించారు.

కాగా, తెలంగాణ జెన్‌కోకు పులిచింతల ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు. పులిచింతలలో అనధికారికంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవీ కూడా చదవండి:

National Doctors Day: జాతీయ వైద్యుల దినోవత్సవం.. డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..

YS Sharmila: వైఎస్ షర్మిల కొత్త పార్టీ జెండా కలర్స్ ఇవేనా.. ఇవాళ వెలసిన ఫ్లెక్సీలు బ్యానర్లు పార్టీ గుర్తులేనా?