Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Doctors Day: జాతీయ వైద్యుల దినోవత్సవం.. డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..

National Doctors Day: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

National Doctors Day: జాతీయ వైద్యుల దినోవత్సవం.. డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..
KCR -
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 30, 2021 | 9:40 PM

National Doctors Day: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారన్న ఆయన.. బాధలనుంచి, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లు అని సీఎం కొనియాడారు. కరోనా సహా అన్ని ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని అన్నారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కునే క్రమంలో తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన ప్రతి డాక్టర్‌కు, వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు.. పేరు పేరునా మరోసారి అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్జంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోషించాలని వైద్యులను కోరారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని రాష్ట్రంలోని ప్రతీ వైద్యునికి సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఇప్పటికే పలు వైద్య కళాశాలలను ప్రభుత్వం నెలకొల్పిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రకాల రోగ నిర్ధారణ చేసే కేంద్రాలను ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభమైందని సీఎం తెలిపారు. అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో మౌలిక వసుతులను మరింత మెరుగు పరిచామన్నారు. బస్తీ దవాఖానల ఏర్పాటుతో డాక్టర్ల సేవలను గల్లీ లోని సామాన్యుల చెంతకు చేర్చామన్నారు. డాక్టర్లతో సహా, అన్ని రకాల వైద్య సిబ్బందిని నియమించడం, ప్రమోషన్లు ఇవ్వడం, మెరుగైన రీతిలో జీత భత్యాలు పెంచడం జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే వైద్య ఆరోగ్య శాఖలో వైద్య సిబ్బంది నియామకం కోసం 20 వేల కొత్త పోస్టులను మంజూరు చేయడం.. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని తెలుపుతుందన్నారు. రానున్న కాలంలో ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. ఈ క్రమంలో డాక్టర్లు, నర్సులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంక్షేమం కోసం, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

Also read:

Coronavirus: కరోనా ఎక్కడికీ పోదు..మామూలు ఫ్లూ వలె భావించాల్సిందే అంటున్న సింగపూర్..ఆంక్షలు సడలించిన దేశాలు ఇవే!

Navjot Singh Sidhu: ఎట్టకేలకు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ భేటీ.. త్వరలో పీసీసీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్!

Ajio Bumper Offers: ‘బిగ్ బోల్డ్ సేల్’ పేరుతో అజియో కళ్లు చెదిరే ఆఫర్లు.. రేపటి నుంచే అందుబాటులోకి..