AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajio Bumper Offers: ‘బిగ్ బోల్డ్ సేల్’ పేరుతో అజియో కళ్లు చెదిరే ఆఫర్లు.. రేపటి నుంచే అందుబాటులోకి..

Ajio Bumper Offers: న్యూ ట్రెండ్స్, సరికొత్త స్టైల్స్‌‌కు ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ ఈ-కామర్స్ ‘అజియో’ తన కస్టమర్లకు..

Ajio Bumper Offers: ‘బిగ్ బోల్డ్ సేల్’ పేరుతో అజియో కళ్లు చెదిరే ఆఫర్లు.. రేపటి నుంచే అందుబాటులోకి..
Image
Shiva Prajapati
| Edited By: uppula Raju|

Updated on: Jul 01, 2021 | 11:01 AM

Share

Ajio Bumper Offers: న్యూ ట్రెండ్స్, సరికొత్త స్టైల్స్‌‌కు ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ ఈ-కామర్స్ ‘అజియో’ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ‘బిగ్ బోల్డ్ సేల్’ పేరతో కళ్లు చెదిరే డిస్కౌంట్లు అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ జులై 1వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. ‘బిగ్ బోల్డ్ సేల్’ పేరుకు తగ్గట్లుగానే అజియో ఫ్యాషన్‌కు సంబంధించి ఇప్పటి వరకు లేని భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. 2,500 లకు పైగా బ్రాండ్లకు చెందిన 6 లక్షల ఫ్యాషన్ ప్రోడక్ట్స్ పై 50 నుంచి 90 శాతం వరకు ఆఫర్‌ను ఇస్తోంది.

అలాగే.. దేశంలోని ప్రతీ కస్టమర్ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని ధరలతో.. ప్రతీ గంటకు స్పెషల్ డీల్స్, రివార్డ్ పాయింట్లను అజియో బిగ్ బోల్డ్ సేల్ పేరుతో అందిస్తోంది. నైకీ, ప్యూమా, అడిడాస్, లివైస్, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్‌కు చెందిన స్టైల్స్ అతి తక్కువ ధరకే అందిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్, గురు రణధావ, శృతి హాసన్, కాజల్ అగర్వాల్, మౌనీ రాయ్ ద్వారా యాడ్స్ ఇస్తూ అజియో ‘బిగ్ బోల్డ్ సేల్’ ఆఫర్‌ గురించి ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచారంతో అజియో ఆఫర్లు మరింతమంది కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. దేశంలో ఫ్యాషన్ ప్రియులకు సరైన వేదికగా నిలుస్తున్న అజియో.. స్త్రీలు, పురుషుల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుస్తులు, యాక్సెసరీ కలెక్షన్స్ అందిస్తోంది. టీ-షర్ట్స్, జీన్స్, కుర్తాలు, స్నీకర్స్‌పై 50 శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇవే కాకుండా మరెన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు చెందిన ఫ్యాషన్ వేర్స్ పై భారీ తగ్గింపునిస్తోంది.

Also read:

Investments: తక్కువ రిస్క్ తో మంచి రాబడి కావాలంటే.. ఇండెక్స్ ఫండ్ లలో పెట్టుబడి ఒక మంచి మార్గం

YS Sharmila: వైఎస్ షర్మిల కొత్త పార్టీ జెండా కలర్స్ ఇవేనా.. ఇవాళ వెలసిన ఫ్లెక్సీలు బ్యానర్లు పార్టీ గుర్తులేనా?

Southern Railways: ప్రయాణీకుల కోసం స్టేషన్ల వద్ద కరోనా టెస్టింగ్ కియోస్క్ లు ఏర్పాటు చేస్తున్న దక్షిణ రైల్వేలు