Liquor Transport : కోళ్ల వ్యర్ధాల మధ్యన మద్యం బాటిల్స్ తరలిస్తోన్న ముఠా గుట్టురట్టు

పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు...ఇప్పటి వరకు కార్ల సీట్లు, డోర్ ల మాటున అక్రమ లిక్కర్ తరలింపు ఉదంతాలు బయటపడగా, ఇప్పుడు కొత్త దారి ఎంచుకున్నారు..

Liquor Transport : కోళ్ల వ్యర్ధాల మధ్యన మద్యం బాటిల్స్ తరలిస్తోన్న ముఠా గుట్టురట్టు
Liquor Transport
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 30, 2021 | 11:42 PM

Liquor bottles : పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు…ఇప్పటి వరకు కార్ల సీట్లు, డోర్ ల మాటున అక్రమ లిక్కర్ తరలింపు ఉదంతాలు బయటపడగా, ఇప్పుడు కొత్త దారి ఎంచుకున్నారు మద్యం తరలింపు దారులు. ఏకంగా కోళ్ల వ్యర్ధాల మాటున మద్యం బాటిల్స్ తరలిస్తూ ఒక రూపాయి వెనకేసుకుంటున్నారు. అయితే ఎన్ని రోజులని జరుగుతుంది ఈ అక్రమ వ్యాపారం. కోళ్ల వ్యర్ధాల మాటున మద్యం తరలిస్తున్నారన్న సమాచారం కాస్తా సెబ్ అధికారులకు తెలియడంతో గుట్టు రట్టైంది.

దీంతో రంగంలోకి దిగిన సెబ్ పోలీసులు నెల్లూరు జిల్లా వెంకటాచలం జాతీయ రహదరిలోని టోల్ ప్లాజా దగ్గర అక్రమ మద్యం తరలింపు వాహనాన్ని సీజ్ చేశారు. చేపల పెంపకం కోసం తీసుకు వస్తున్న కోళ్ల వ్యర్ధాల మాటున కర్ణాటక నుంచి తీసుకు వస్తున్న మధ్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు.

కోళ్ల వ్యర్ధాలు అందులోని భరించలేని వాసన ఎవరు తనికీ చేస్తారులే అనుకున్నారు పాపం. కానీ సెబ్ అధికారులకు వచ్చిన సమాచారంతో బాటిల్స్ గుట్టు బైట పడింది. దీంతో 55 మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు సెబ్ అధికారులు.

Read also : జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌.. వరుసగా నాలుగో రోజు కూడా ఎయిర్‌బేస్‌, ఆర్మీ బేస్‌లపై సంచారం