Jagga Reddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమైన తరుణాన వనదేతల దర్శనానికి జగ్గారెడ్డి
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ములుగు జిల్లా మేడారంలో కొలువైన సమ్మక్క, సారక్క దేవతలను దర్శించుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..
Jagga Reddy : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ములుగు జిల్లా మేడారంలో కొలువైన సమ్మక్క, సారక్క దేవతలను దర్శించుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమైన తర్వాత వనదేతలను దర్శించుకొని…పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా గట్టమ్మగుట్టకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. వనదేతల్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు జగ్గారెడ్డి. సమ్మక్క-సారక్క దీవెనలు ఎల్లప్పుడు రాష్ట్ర ప్రజలకు ఉండాలని…రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అమ్మవార్లను వేడుకున్నట్లుగా జగ్గారెడ్డి తెలిపారు. సమ్మక్క-సారక్క దేవతల్ని దర్శించుకునేందుకు వచ్చిన జగ్గారెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.