Mallu Ravi: గతంలో మీ లీడర్ కూడా అక్కడి నుంచే వచ్చారు.. జీవన్‌రెడ్డికి మల్లు రవి కౌంటర్
TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై TRS ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మల్లు రవి మండిపడ్డారు. జీవన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై TRS ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మల్లు రవి మండిపడ్డారు. జీవన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనుచిత, అర్థరహిత వ్యాఖ్యలతో రాజకీయాలలో విలువ లేకుండా చేస్తున్నారని ఆయన వాపోయారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చి అధ్యక్షులు అయితే.. సీఎం కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్‌కు అధ్యక్షుడు అయ్యారని మల్లు రవి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మీద కేసులున్నాయని అంటున్నాని.. సీఎం కేసీఆర్ మీద సీబీఐ కేసులు లేవా అంటూ ప్రశ్నించారు.
అందుకోసం ఆయన ప్రధాని మోడీ, అమిత్ షా వద్ద వొంగి వొంగి దండలు పెట్టడం లేదా అంటు ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని.. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా.. అభద్రతో మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి పిచ్చి, అనుచిత మాటలు మాట్లాడడం మానుకోకపోతే టీఆర్ఎస్‌కు ప్రజలు త్వరలోనే గట్టి బుద్ధి చెవుతారని మల్లు రవి మండిపడ్డారు.