AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్ లో ఆప్ నేతలపై దాడి.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన.. బీజేపీపై ఆరోపణ

గుజరాత్ జునాగఢ్ జిల్లాలో బుధవారం సాయంత్రం 10 మంది ఆప్ నేతలపై దాడి జరగడాన్ని ఈ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఈ ఎటాక్ వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు.

గుజరాత్ లో ఆప్ నేతలపై దాడి.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన.. బీజేపీపై ఆరోపణ
Attack On Aap Leader In Guj
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 01, 2021 | 11:02 AM

Share

గుజరాత్ జునాగఢ్ జిల్లాలో బుధవారం సాయంత్రం 10 మంది ఆప్ నేతలపై దాడి జరగడాన్ని ఈ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఈ ఎటాక్ వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ గణనీయంగా బలం పెంచుకోవడంపై బీజేపీ ఆగ్రహంతో ఉందని…ఈ దడి ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో మాట్లాడానని ఆయన ట్వీట్ చేశారు. అసలు మా పార్టీయే కాదు.. ఎవరికీ భద్రత లేకుండా పోయిందని కూడా ఆయన అన్నారు. కాగా ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆ ఎటాక్ తో తమకు సంబంరంధం లేదని, కొందరు స్థానికులకు, ఆప్ వారికి మధ్య ఘర్షణ జరిగిందని గుజరాత్ బీజేపీ శాఖ చీఫ్ కిరీట్ పటేల్ అన్నారు.. కాగా-గుజరాత్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో తాము కూడా పోటీ చేసి తమ పార్టీని విస్తృతం చేసుకోవాలని ఆప్ భావిస్తోంది.

జునాగఢ్ జిల్లాలోని లెరియా గ్రామంలో నిన్న సాయంత్రం ఆప్ నేతలు జన సంవేదన యాత్ర నిర్వహిస్తుండగా వారిపై బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్నవారు దాడికి దిగినట్టు తెలిసింది. సుమారు 70 మంది వారిని చుట్టుముట్టి ఎటాక్ చేసినట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. గుజరాత్ ఆప్ శాఖ చీఫ్ గోపాల్ ఇటాలియా కూడా దాడికి గురైనవారిలో ఉన్నారన్నారు. కానీ తమ కార్యకర్తలెవరూ ఇందుకు పాల్పడలేదని.. ఓ సంస్థకు చెందినవారు ఆప్ యాత్రను వ్యతిరేకించగా ఆప్ నేతలు వారిని దుర్భాషలాడారని..దాంతో ఉభయుల మధ్య ఘర్షణ జరిగిందని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు కిరీట్ పటేల్ వెల్లడించారు.అటు-గుజరాత్ శాసన సభలోని 182 సీట్లకూ తాము పోటీ చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana: ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్.. మహిళ మృతి.. స‌మ‌యానికి ఆ మేస్త్రీ దేవుడిలా వ‌చ్చాడు

Mallu Ravi: గతంలో మీ లీడర్ కూడా అక్కడి నుంచే వచ్చారు.. జీవన్‌రెడ్డికి మల్లు రవి కౌంటర్