AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్.. మహిళ మృతి.. స‌మ‌యానికి ఆ మేస్త్రీ దేవుడిలా వ‌చ్చాడు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్ తగలడంతో ఓ మహిళ మ‌ర‌ణించ‌గా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Telangana: ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్.. మహిళ మృతి.. స‌మ‌యానికి ఆ మేస్త్రీ దేవుడిలా వ‌చ్చాడు
TS RTC Bs accident
Ram Naramaneni
|

Updated on: Jul 01, 2021 | 10:55 AM

Share

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్ తగలడంతో ఓ మహిళ మ‌ర‌ణించ‌గా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే.. అచ్చంపేటకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కల్వకుర్తి బస్టాండ్‌లో పాసింజ‌ర్స్‌ను ఎక్కించుకుని అచ్చంపేటకు బయల్దేరింది. పట్టణంలోని హనుమాన్‌నగర్‌ కాలనీలో మురుగుకాల్వ నిర్మాణం చేపడుతుండటంతో బస్సును డ్రైవర్‌ ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద డైవర్షన్‌ తీసుకున్నాడు. ఈ క్ర‌మంలో అక్కడ కిందకు వేలాడుతున్న క‌రెంట్ తీగను గమనించక ముందుకు వెళ్లాడు. దీంతో బస్సు టాప్‌పై ఉండే క్యారియర్‌కు తీగ తగిలి ఎర్తింగ్‌ వచ్చింది. దీంతో ప్రయాణికులంతా ఒక్క‌సారిగా కేకలు వేశారు. ప్రమాదం జ‌రిగిన‌ సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌ సహా 24 మంది పాసింజ‌ర్స్ ఉన్నారు. ఓ తాపీ మేస్త్రీ స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. అక్కడే పనిచేస్తున్న తాపీమేస్త్రీ శ్రీశైలం పరిస్థితిని గమనించి వెంటనే తాను పని చేసే స్థలం వద్ద ఉన్న పెద్ద కర్రను తీసుకొచ్చి విద్యుత్‌ తీగను పక్కకు నెట్టాడు.

అయితే అప్పటికే డ్రైవర్ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకుని ఎవరూ బస్సు దిగవద్దని అంద‌ర్నీ హెచ్చ‌రించాడు. అప్పటికే ప్రాణభయంతో డోరు వద్ద ఉన్న వంగూరు మండలం రంగాపూర్‌కు చెందిన నర్సమ్మ (50) తన ఇంటికి అవసరమైన ఇనుప వెంటిలేటర్లను తీసుకుని, బస్సులోని ఐరన్‌ రాడ్డు సహాయంతో కిందకు దిగింది. వెంటనే కరెంట్ షాక్‌కు గురై ఆమె స్పాట్‌లోనే మృతి చెందింది. మరో ప్రయాణికుడు వృద్ధుడైన రెడ్యా భయంతో కిటికిలోంచి దూకడంతో తీవ్ర గాయాల‌య్యాయి.

Also Read: రంగంలోకి నంద‌మూరి ఫ్యాన్స్.. కాళ్ల‌బేరానికి వ‌చ్చిన సునిశిత్ ..

దేశవ్యాప్తంగా తగ్గిన పాజిటివ్ కేసులు.. పెరిగిన మరణాలు..

Follow Us
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు