YSR Pension Kanuka: రేపే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ.. సర్వం సిద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..
YSR Pension Kanuka: రేపే(జులై 1న) వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సర్వం సిద్ధం చేసింది.
YSR Pension Kanuka: రేపే(జులై 1న) వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 60.95 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారు. ఇందుకోసం రూ. 1,484.9 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా గడప వద్దనే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. మూడు రోజుల్లో నూరు శాతం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
ఇదిలాఉండగా.. వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో పాటు, వైఎస్ఆర్ బీమా పథకాన్ని కూడా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. గురువారం నాడు క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్.. వైఎస్ఆర్ బీమా పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దురదృష్టవశాత్తూ కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ‘వైఎస్ఆర్ బీమా’ ద్వారా పేద కుటుంబాలకు ఉచిత బీమా అందిస్తోంది. అయితే, బ్యాంకులలో ఎన్‌రోల్‌మెంట్‌లో జరుగుతున్న జాప్యానికి, వస్తున్న అవరోధాలకు చెక్‌పెడుతూ బ్యాంకులతో సంబంధం లేకుండా 2021, జులై 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహించనుంది.
Also read: