Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi mi11: షియోమి విడుదల చేసిన మి11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రికార్డ్ సేల్స్..ఏడు రోజుల్లో అమ్మకాల లెక్క ఎంతంటే..

Xiaomi mi11: షియోమి గత వారం మి11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు దేశంలో మంచి స్పందన వచ్చింది.

Xiaomi mi11: షియోమి విడుదల చేసిన మి11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రికార్డ్ సేల్స్..ఏడు రోజుల్లో అమ్మకాల లెక్క ఎంతంటే..
Xiaomi Mi 11 Lite
Follow us
KVD Varma

|

Updated on: Jun 30, 2021 | 10:45 PM

Xiaomi mi11: షియోమి గత వారం మి11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు దేశంలో మంచి స్పందన వచ్చింది. ఈ ఫోన్ కేవలం ఒక వారంలోనే 200 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలను దాటింది. అమ్మకాలకు సంబంధించిన ఈ సంఖ్యను మి ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర 21,999 రూపాయలుగా ఉంది. మి అభిమానులు, మి 11 లైట్ ప్రారంభించిన 7 రోజుల్లోనే 200 కోట్ల వ్యాపారం చేసిందని మీకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని తన సోషల్ మీడియా పోస్ట్ లో కంపెనీ పేర్కొంది. ఫోన్‌కు ఇంత గొప్ప స్పందన ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ చెప్పింది.

మి 11 లైట్ ధర ఇలా..

కంపెనీ రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .21,999. అదే విధంగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .23,999. ఫోన్‌ను జాజ్ బ్లూ, టుస్కానీ కోరల్, వినైల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

మి 11 లైట్ స్పెసిఫికేషన్స్

  • ఫోన్ డ్యూయల్-నానో సిమ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారిత సంస్థ MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తుంది. ఫోన్ 6.55-అంగుళాల పూర్తి-HD + (1,080×2,400 పిక్సెల్స్) AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. స్క్రీన్‌ను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో అందించారు.
  • ఇందులో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి ప్రాసెసర్, అడ్రినో 618 జిపియు, 8 జిబి ర్యామ్ ఉన్నాయి. ఫోన్ 128GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంది. ఇది 512GB మైక్రో SD కార్డుకు కూడా మద్దతు ఇస్తుంది.
  • కెమెరా గురించి చెప్పుకుంటే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఫోన్‌లో ఉంది. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. మెరుగైన ఫోటోగ్రఫీ కోసం ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంటుంది.
  • ఫోన్ 4 కె వీడియో రికార్డింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అదే సమయంలో, సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో AI బ్యూటిఫై, నైట్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 4 జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11 ఎసి, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్), బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ కూడా ఉన్నాయి. ఇది హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్‌ను కలిగి ఉంది. దుమ్ము ,నీటి నిరోధకత కోసం దీనికి ఐపి 53 సర్టిఫికేట్ కూడా దీనికి ఉంది.
  • ఫోన్ 4,250 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 33W ఫాస్ట్ చార్జింగ్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంది.

Also Read: Whats App: వాట్సప్ ప్రైవసీకి పెద్ద పీట..వ్యూ వన్స్ పేరిట కొత్త ఫీచర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

Vivo Y73: స్మార్ట్‌ఫోన్‌ ధర..ప్రీమియం ఫీచర్లు..కొత్త వివో వై 73..ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..