Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.. సంతనూతలపాడు పేర్ణమిట్ట దగ్గర 90 ఎకరాలు స్థలం కేటాయింపు

Andhra Kesari University : ఒంగోలు సమీపంలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు...

ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.. సంతనూతలపాడు పేర్ణమిట్ట దగ్గర 90 ఎకరాలు స్థలం కేటాయింపు
Adimulapu Suresh
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 30, 2021 | 10:39 PM

Andhra Kesari University : ఒంగోలు సమీపంలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రకాశం జిల్లా ప్రజల కల సాకారం అయిందని మంత్రి వెల్లడించారు. యూనివర్సిటీ ఏర్పాటు కోసం సంతనూతలపాడు మండలం పేర్ణమిట్ట వద్ద 90 ఎకరాలు స్థలం కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కేటాయించిన 339.54కోట్లు నిధులు నాలుగేళ్ళలో ఖర్చు చేసె విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొదటి ఏడాది 204.08కోట్లు, రెండో ఏడాది 7.15కోట్లు, మూడో ఏడాది 114.26 కోట్లు, నాలుగో ఏడాది 14.05 కోట్లు ఖర్చు చేయటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఏ ఎన్ యూ పీజీ సెంటర్‌ను ప్రభుత్వం రీలొకేట్‌ చేయనున్నదని,19 డిపార్ట్‌మెంట్లతో యూనివర్శిటీలో వేయిమంది విద్యార్థులతో తొలుత ప్రారంభం అవుతుందని మంత్రి సురేష్ తెలిపారు.

యూనివర్సిటీ ఏర్పాటుకోసం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి కృషి చేశారని దాని ఫలితంగా త్వరితగతిన ఫలితం వచ్చిందని మంత్రి సురేష్ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఒక్క పోస్ట్ కూడా మంజూరు చేయకుండా కేవలం యూనివర్సిటీ ఏర్పాటుపై ఉత్తుత్తి హామీలు ఇచ్చారని, కానీ విద్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి జగనన్న యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు రూ. 339.54 కోట్లు మంజూరు చేస్తున్నారని మంత్రి అన్నారు. అంతే కాకుండా 114 పోస్టులు కూడా మంజూరవుతాయని అందులో 76 టీచింగ్, 38 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరుకు కూడా ఆమోదం తెలపటం జరిగిందన్నారు.

వినూత్న రీతిన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రకాశం యూనివర్సిటీ లోని కోర్సుల్లో ఉపాధ్యాయ విద్య కోర్స్ ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. డైట్ తరహాలో ఉపాధ్యాయుల శిక్షణకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఇది రాష్ట్రంలోనే తొలిసారి ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ లో ఏర్పాటు చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు మంచి మనస్సుతో ఆమోదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కృషి చేసిన మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట, మాజీ టీటీడీ చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి లకు మంత్రి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.

Read also : Gutka mafia : నిషేధిత పదార్ధాలతో జనాల ప్రాణాలను హరిస్తూ కోట్లు గడిస్తున్న అక్రమార్కుల డెన్‌ని బద్దలు కొట్టిన పోలీసులు