Osmania University Exams: పోస్ట్‌పోన్ అయిన పీజీ ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
Osmania University Exams: కరోనా కారణంగా పోస్ట్‌పోన్ అయిన పీజీ సెమిస్టర్ పరీక్షల రీ షెడ్యూల్ వచ్చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ..
Osmania University Exams: కరోనా కారణంగా పోస్ట్‌పోన్ అయిన పీజీ సెమిస్టర్ పరీక్షల రీ షెడ్యూల్ వచ్చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డిపార్ట్‌మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం నాడు విడుదల చేసింది. M.Sc, M.A, M.Com, M.S.W, M.Lib.I.SC, MJ&MC, M.Com.(IS) మూడవ సెమిస్టర్ (CBCS- రెగ్యులర్) పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను ప్రకటించింది. కరోనా కారణంగా వాయిదా పడ్డ పేపర్-4, పేపర్-5 పరీక్షలను జులై 14, 15వ తేదీలలో నిర్వహించారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. పేపర్ – IV పరీక్షలు 14-07-2021(బుధవారం) నాడు నిర్వహించనున్నారు. అలాగే పేపర్ -V పరీక్షలు 16-07-2021(శుక్రవారం) నాడు నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. పరీక్షా కేంద్రంలో ఎటువంటి మార్పు లేదని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్పష్టం చేశారు.
వాస్తవానికి ఈ రెండు పేపర్ల పరీక్షలు 26-03-2021, 30-03-2021 తేదీలలో జరగాల్సి ఉంది. అయితే అప్పటికే కరోనా వ్యాప్తి మొదలవడంతో విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఆ పరీక్షలను రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు సద్ధుమణగడంతో తిరిగి ఈ పరీక్షలను నిర్వహించాలిన ఉస్మానియా యూనివర్సిటీ అధికారయంత్రాంగం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పరీక్షల రీ షెడ్యూల్‌ను ప్రకటించింది. పరీక్షల రీ షెడ్యూల్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ పొందుపరచడం జరిగిందని, విద్యార్థులు ఈ రీ షెడ్యూల్‌ను చూసుకోవాలని సూచించారు.
Also read:
Sacrificing Star Sunisith: రంగంలోకి నందమూరి ఫ్యాన్స్.. కాళ్లబేరానికి వచ్చిన సునిశిత్ ..
Border Tension: ఓవైపు పాక్ డ్రోన్లు.. ఇంకోవైపు డ్రాగన్ మిలిటరీ.. సరిహద్దుల్లో మళ్ళీ టెన్షన్