Telangana Corona Updates: తెలంగాణలో కొత్తగా 917 కరోనా పాజిటివ్ కేసులు.. 10 మంది మృతి..
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా సెకండ్ ప్రభావం రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజూవారీగా నమోదయ్యే...
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా సెకండ్ ప్రభావం రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజూవారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,09,802 సాంపిల్స్ సేకరించగా.. వీరిలో 917 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 1,006 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావంతో ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,388 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కరోనా రికవరీల రేటు 97.26 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతం ఉంది.
కాగా, తాజాగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,23,510 లకు చేరింది. వీరిలో 6,06,461 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక వైరస్ ప్రభావంతో 3,661 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,86,71,907 మంది సాంపిల్స్ పరీక్షించారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 108 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ – 2 బద్రాద్రి కొత్తగూడెం – 52 జీహెచ్ఎంసీ – 108 జగిత్యాల – 28 జనగామ – 9 జయశంకర్ భూపాలపల్లి – 17 జోగులాంబ గద్వాల – 1 కామారెడ్డి – 5 కరీంనగర్ – 66 ఖమ్మం – 58 కొమరంభీం ఆసిఫాబాద్ – 5 మహబూబ్‌నగర్ – 19 మహబూబాబాద్ – 53 మంచిర్యాల – 61 మెదక్ – 7 మేడ్చల్ మల్కాజిగిరి – 35 ములుగు – 18 నాగర్ కర్నూల్ – 7 నల్లగొండ – 71 నారాయణ పేట – 4 నిర్మల్ – 4 నిజామాబాద్ – 9 పెద్దపల్లి – 39 రాజన్న సిరిసిల్ల – 20 రంగారెడ్డి – 43 సంగారెడ్డి – 7 సిద్దిపేట – 29 సూర్యాపేట – 57 వికారాబాద్ – 7 వనపర్తి – 10 వరంగల్ రూరల్ – 11 వరంగల్ అర్బన్ – 36 యాదాద్రి భువనగిరి – 19
Also read:
AP Corona Cases: ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!
Anushka Shetty: ఎమోషనల్ మెసేజ్ చేసిన అనుష్క…!! అసలేమైంది…?? ( వీడియో )