Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gutka mafia : నిషేధిత పదార్ధాలతో జనాల ప్రాణాలను హరిస్తూ కోట్లు గడిస్తున్న అక్రమార్కుల డెన్‌ని బద్దలు కొట్టిన పోలీసులు

డ్రగ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా...ఈ లిస్ట్‌లోకి గుట్కా మాఫియా వచ్చి చేరింది. ఇప్పటి వరకూ చాటు మాటుగా, వందలు, వేలల్లో జరిగే గుట్కా..

Gutka mafia : నిషేధిత పదార్ధాలతో జనాల ప్రాణాలను హరిస్తూ కోట్లు గడిస్తున్న అక్రమార్కుల డెన్‌ని బద్దలు కొట్టిన పోలీసులు
Gutka mafia
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 30, 2021 | 6:47 PM

(Naresh, TV9 Reporter, Adilabad district)

Illegal business centers : డ్రగ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా…ఈ లిస్ట్‌లోకి గుట్కా మాఫియా వచ్చి చేరింది. ఇప్పటి వరకూ చాటు మాటుగా, వందలు, వేలల్లో జరిగే గుట్కా వ్యాపారం…ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. అధికారులు అడపాదడపా తనిఖీలు, దాడులు చేస్తున్నప్పటికి అక్రమంగా గుట్కా అమ్ముకునేందుకు కొత్త దార్లు వేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. మంచిర్యాల జిల్లాలో ఏకంగా కోటి రూపాయల విలువ చేసే గుట్కా సరుకును దాచేందుకు ఏకంగా ఒక డెన్‌ని ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే సరుకుని దాచిపెట్టి దందా చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో నిషేధిత మాదక ద్రవ్యాలతో జనాల ప్రాణాలను తీస్తూ కోట్లు గడిస్తున్న అక్రమార్కుల డెన్‌ని బద్దలు కొట్టారు పోలీసులు. గుట్కా మాఫియాపై గట్టి నిఘా పెట్టిన రామగుండం పోలీసులు కాగజ్‌నగర్, జన్నారం ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగానే కాగజ్‌నగర్‌లో బంకర్ ఏర్పాటు చేసుకొని అందులో స్టాక్ పెట్టుకున్న రూ. 40 లక్షలు విలువ చేసే నిషేదిత గుట్కా ప్యాకెట్లు, బాక్సులను సీజ్ చేశారు. మార్కెట్‌ విలువ ప్రకారం పట్టుబడిన గుట్కా విలువ కోటి రూపాయలు చేస్తుందని పోలీసులు తెలిపారు.

ఈ గుట్కా దందా నిర్వహిస్తున్న షేక్ ఇంతియాజ్, సమీరుల్లాఖాన్‌ని రామగుండం పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో ఇంతియాజ్ 17 కేసుల్లో నిందితుడిగా ఉండగా,  సమీర్ మూడు కేసుల్లో నిందితుడు. వీరిద్దరితో పాటు..  జన్నారం జడ్పీటీసీ ఎర్రం చంద్రశేఖర్‌తో పాటు,  ఆయన సోదరుడు నరేష్‌ సైతం ఈ దాందాకు సంబంధించి పట్టుబడ్డారని సీపీ సత్యనారాయణ తెలిపారు. గుట్కా దందాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. పట్టుబడితే ఎంతటి వారిపైనైనా  పీడీ యాక్ట్ మోపుతామని వార్నింగ్ ఇస్తున్నారు.

Read also : Woman protest : తన భూమికి పట్టా చేయాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి.. తిరిగి, చివరికి తాళిబొట్టు కట్టింది