Covid 19 vaccine: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం.. ఇప్పటివరకు 33 కోట్ల మందికి అందిన కోవిడ్ టీకా

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం.

Covid 19 vaccine: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం.. ఇప్పటివరకు 33 కోట్ల మందికి అందిన కోవిడ్ టీకా
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 30, 2021 | 2:49 PM

Covid vaccine doses administered in India: దేశంలో కరోనా ఒక రోజు ఎక్కువ.. మరొక్క రోజు తక్కవగా వస్తున్నాయి. ఎక్కువలు తక్కువలతో దోబుచులాడుతోంది. ఇవాళ కొత్తగా 45వేల 951 కేసులు నమోదు అయ్యాయి. 817 మంది చనిపోయారు. నిన్న 40వేలకు దిగువకు వెళ్లాయి కేసులు. మళ్లీ ఈ రోజు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్‌ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

Covid Vaccine

Covid Vaccine

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 కోట్ల 82 లక్షల 63 వేల 421 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 27 కోట్ల 7 లక్షల 70 వేల 743 మందికి మొదటి డోస్‌ అందగా.. 5 కోట్ల 74 లక్షల 92 వేల 678 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 11 లక్షల 99 వేల 112 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేసుకునేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు కోటి 54 లక్షల 46 వేల 373 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. కోటి 23 లక్షల 83 వేల 505 మందికి మొదటి డోస్‌ అందగా.. 30 లక్షల 62 వేల 868 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 9 లక్షల 15 వేల 989 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్‌ పూర్తైన వారు 93 లక్షల 61 వేల 051 మంది కాగా.. రెండో డోస్‌ పూర్తైన వారు 15 లక్షల 54 వేల 974 మంది ఉన్నారు.

ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 28 కోట్ల 83లక్షల 99 వేల 020 మందికి covisheild అందితే.. 3 కోట్ల 97 లక్షల 54 వేల 396 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 34 కోట్లు దాటింది. ఆ వివరాలు చూస్తే.. 35 కోట్ల లక్షా 87 వేల 089 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 16 కోట్ల 65 లక్షల 91 వేల 339 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 18 కోట్ల 35 లక్షల 95 వేల 744 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

Covid Vaccine

Covid Vaccine

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకా తీసుకోండి.. కరోనా వైరస్‌ సంక్రమణను నివారించండి.

Read Also…  International Flights: డీజీసీఏ కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం పొడిగింపు.. 

అడవి పందుల నుంచి రక్షణ కోసం వల పెట్టారు.. అందులో చిక్కింది చూస్తే
అడవి పందుల నుంచి రక్షణ కోసం వల పెట్టారు.. అందులో చిక్కింది చూస్తే
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..