COVID-19 patients: అస్సాంలో విషాదం.. గౌహతి ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కరోనా బాధితుల మృతి

Assam Covid deaths: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఈ సంఘటన గౌహతి మెడికల్‌

COVID-19 patients: అస్సాంలో విషాదం.. గౌహతి ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కరోనా బాధితుల మృతి
Covid-19
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 30, 2021 | 1:47 PM

Assam Covid deaths: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఈ సంఘటన గౌహతి మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌ (జీఎంసీహెచ్‌)లో చోటు చేసుకుంది. రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే.. మరణాలు సంభవించాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన 12 మందిలో ఐసీయూలో ఉన్న తొమ్మిది మంది, వార్డులో ఉన్న ముగ్గురు రోగుల్లో ఆక్సిజన్‌ స్థాయిలు 90 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అభిజిత్‌ శర్మ పేర్కొన్నారు. ఐసీయూలో ఉన్న రోగులకు కోమోర్బిడిటీస్ ఉన్నాయని, ఆక్సిజన్‌ స్థాయి అవసరమైన దానికంటే తక్కువగా ఉందన్నారు. ఆ రోగులంతా పరిస్థితి విషమించిన అనంతరమే ఆసుపత్రికి వచ్చారని డాక్టర్‌ శర్మ వివరించారు.

వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదని.. దీంతో వారు చనిపోయారన్నారు. మృతుల్లో ఎవరూ ఒక్క మోతాదు వ్యాక్సిన్‌ తీసుకోలేదని పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారు.. తమ ఆరోగ్యం దృష్ట్యా సాధ్యమైనంత తర్వగా ఆసుపత్రి, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చేరాలని కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సుమారు 200 మంది వరకు ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి మహంత ఆసుపత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: Girl Raped: యూపీలో దారుణం.. బాలిక శీలానికి వెలకట్టిన పంచాయతీ పెద్దలు.. ఐదు చెప్పు దెబ్బలు, రూ. 50వేలు జరిమానా..

Ys Sharmila: పొలిటిక‌ల్ డైలాగ్స్ పేల్చిన వైయ‌స్. ష‌ర్మిల‌.. రేవంత్ రెడ్డిపై కూడా అటాక్

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!