Ys Sharmila: పొలిటిక‌ల్ డైలాగ్స్ పేల్చిన వైయ‌స్. ష‌ర్మిల‌.. రేవంత్ రెడ్డిపై కూడా అటాక్

అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవ సంద‌ర్భంగా వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఎంతో అవసరమ‌న్న ఆమె.. అవన్నీ చేయలేనివి...

Ys Sharmila: పొలిటిక‌ల్ డైలాగ్స్ పేల్చిన వైయ‌స్. ష‌ర్మిల‌.. రేవంత్ రెడ్డిపై కూడా అటాక్
Ys Sharmila
Follow us

|

Updated on: Jun 30, 2021 | 1:49 PM

అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవ సంద‌ర్భంగా వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఎంతో అవసరమ‌న్న ఆమె.. అవన్నీ చేయలేనివి చేసేదే 5th ఎస్టేట్ అని పేర్కొన్నారు. ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధం సోషల్ మీడియా అని వెల్ల‌డించారు. అలాంటి సోషల్ మీడియాకు హ్యాట్సాఫ్ చెప్పిన ఆమె.. జులై 8వ తేదీన కొత్త పార్టీ వైఎస్సార్‌టీపీ ప్రకటన ఉంటుంద‌న్నారు. తెలంగాణ‌లో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా పార్టీ పెడుతున్న‌ట్లు చెప్పుకొచ్చారు. విద్య, వైద్యం ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందించాలన్న‌దే త‌న ధ్యేయ‌మ‌న్నారు. అన్ని కులాలు, మ‌తాల‌కీ అతితంగా పార్టీ ఉంటుంద‌ని చెప్పారు. ఇలాంటివన్నీ చేయాలంటే సోషల్ మీడియా అవసరం ఎంతో ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. నెటిజ‌న్ల స‌పోర్ట్ లేకుండా తానేం చేయలేనని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆమె కొన్ని పొలిక‌ల్ డైలాగ్స్ కూడా పేల్చారు. టీ.ఆర్‌.ఎస్‌కు సోషల్ మీడియాకు ఎంప్లాయిస్ ఉన్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ని చేశారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వాళ్లకు కూడా సోషల్ మీడియా ఎంప్లాయిస్ ఉన్నారు కానీ త‌మ‌కు ఆ అవ‌స‌రం లేద‌ని ష‌ర్మిల చెప్పారు. కార్య‌కర్త‌లు, వెఎస్సార్ అభిమానులే త‌న సైన్య‌మ‌న్నారు. సోషల్ మీడియా లేకుండా ఎలాంటి పని ముందుకు సాగదని పేర్కొన్నారు. పార్టీ కార్య‌కలాపాలు లైక్స్, షేర్స్ చేస్తూ అన్ని వేదికల్లో యాక్టివ్ గా ఉండాలని, అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పారు. ఫేక్ న్యూస్ ఎండ‌గట్టే విధంగా పనిచెయ్యాల‌ని ష‌ర్మిల కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.

హైదరాబాద్​లో షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత..

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నెలకొనగా.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతామని రెండ్రోజుల క్రితం షర్మిల ట్విట్టర్‌లో ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదురిస్తామని తెలిపారు. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క అన్యాయం జరిగినా సహించేది లేదంటూ ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్​పై ఆగ్రహించిన రైతులు కృష్ణా జలాలపై వైఖరి చెప్పాలంటూ షర్మిల నివాసం ముందు ఆందోళనకు దిగారు. వీరితో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కూడా కలిశారు.

Also Read: తెలంగాణ మంత్రుల కామెంట్స్‌కు.. తొలిసారి ఘాటుగా బ‌దులిచ్చిన ఏపీ మంత్రి బొత్స‌

తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన ‘జల జగడం’.. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం మరో లేఖ!

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..