Srisailam Water: తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన ‘జల జగడం’.. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం మరో లేఖ!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకూ చిలికి చిలికి గాలివాన అవుతోంది. నిన్నటి వరకు నీటి వాటాలపై నెలకొన్న వివాదం..

Srisailam Water: తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన 'జల జగడం'.. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం మరో లేఖ!
Krishna River Board
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 30, 2021 | 10:48 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకూ చిలికి చిలికి గాలివాన అవుతోంది. నిన్నటి వరకు నీటి వాటాలపై నెలకొన్న వివాదం కాస్తా ఇప్పుడు పవర్ పంచాయితీగా టర్న్ అయింది. అనుమతి లేకుండా జరుగుతోన్న విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు వరుసగా మూడోసారి లేఖ రాసింది.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని నీటిని వినియోగిస్తోందంటూ ఏపీ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. జూన్ 1 తేదీ నుంచే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం కేటాయింపుతో సంబంధం లేకుండానే నీటిని వినియోగించుకుంటోందని కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు సుమారు 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని పేర్కొంటూ కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. ఇప్పటికే ఈ అంశంపై రెండుసార్లు లేఖ రాసినా.. కేఆర్ఎంబీ పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

కాగా, ఎగువ నుంచి 17.36 టీఎంసీల మేర నీటి ప్రవాహాలు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంటే.. అందులో 40 శాతం నీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా నీటిని వినియోగించటం సరికాదన్నారు. తదుపరి నీటి వినియోగాన్ని నిలుపుదల చేసేలా తెలంగాణ అధికారులను నిలువరించాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

Also Read: 

ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో