Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై మరో ట్విస్ట్..హై కోర్టును ఆశ్రయించిన మారుతి మహాలక్ష్మామ్మ

బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపత్యం వివాదం

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై మరో ట్విస్ట్..హై కోర్టును ఆశ్రయించిన మారుతి మహాలక్ష్మామ్మ
Maruti Mahalakshmamma
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 30, 2021 | 1:57 PM

బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపత్యం వివాదం ముగిసిందన్న క్రమంలో తిరిగి మొదటికొచ్చింది. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీఠాధిపత్యం విషయంతో తనపై ఒత్తిడి తెచ్చి అంగీకరించేలా చేశారంటూ మహాలక్ష్మమ్మ ఆరోపించారు. పెద్దమనుషుల రాజీ చర్చల్లో తనను బలవంతంగా ఒప్పించారని ఆమె హైకోర్టులో పిటిషన్‌లో పేర్కొన్నారు.

పీఠాధిపతి నియామకం అనేది వీలునామా ప్రకారమా..? లేదా కుటుంబ సభ్యుల ఒప్పందం ప్రకారమా..? అనేది తేల్చాలని హైకోర్టును కోరారు. వీలునామా ప్రకారం తన కుమారుడికే వారసత్వం దక్కాలని కోకుంటున్నట్లుగా పిటిషన్‌లో పేర్కొన్నారు.

నాలుగు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో రాజీ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా రెండో కొడుకు వీరభద్రస్వామిని ఎన్నిక చేస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు. తాజాగా మారుతి మహాలక్ష్మమ్మ పీఠాధిపత్యం వివాదంలో హైకోర్టును ఆశ్రయించడంతో  వివాదం మళ్లీ మొదటికొచ్చిందంటున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి : Cabinet meeting: ఇవాళ కేంద్ర మంత్రి వర్గ కీలక సమావేశం… కేబినెట్ విస్తరణపై ఫోకస్..

Lovers Suicide: తోటపల్లి బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య.. కన్నీరు మున్నీరవుతున్న ఇరు కుటుంబాలు

బెజవాడ గుండెల్లో గుబులు.. చికటి పడిందంటే కనిపించే “మంకీ మ్యాన్”..! మహిళలే టార్గెట్..! ఏం చేస్తాడో తెలుసా..!