Cabinet meeting: ఇవాళ కేంద్ర మంత్రి వర్గ కీలక సమావేశం… కేబినెట్ విస్తరణపై ఫోకస్..

Cabinet Reshuffle Buzz: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎవరికి అవకాశం దొరుకుతుంది.. మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అన్నదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా...

Cabinet meeting: ఇవాళ కేంద్ర మంత్రి వర్గ కీలక సమావేశం... కేబినెట్ విస్తరణపై ఫోకస్..
Pm Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 30, 2021 | 8:12 AM

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ కేంద్ర మంత్రివర్గ కీలక భేటీ జరుగనుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ఈ సమావేశానికి అధిక ప్రధాన్యత నెలకొంది.   కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్‌ విధానంలోనే సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా దేశంలోని పరిస్థితులతో మంత్రులతో ప్రధాని మోడీ చర్చించనున్నారు. ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం జమ్ములోని ఎయిర్ బేస్ మీద జరిగిన డ్రోన్ దాడిపై సీరియస్‌గా చర్చించనున్నారు. వీటితోపాటు రోడ్డు రవాణా, పౌర విమానాయశాఖ, టెలీకాం మంత్రిత్వశాఖలు చేపట్టిన పనులపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మోదీ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో కేంద్రమంత్రివర్గ మార్పులు, చేర్పులుంటాయని ఊహాగానాలున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎవరికి అవకాశం దొరుకుతుంది.. మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అన్నదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన కేబినెల్ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారు అయ్యినట్లు రాజకీయవర్గాలు చెప్పుకుంటున్నాయి.

పలువురు మంత్రుల అకాల మరణాలతో కేంద్ర కేబినెట్‌లో ఖాళీలు ఏర్పడ్డాయి. సీనియర్ మంత్రి, మిత్రపక్షం లోక్‌జనశక్తి నేత రాంవిలాస్ పాశ్వాన్, కర్నాటక బీజేపీ నేత సురేశ్ అంగడి మృతితో రెండు శాఖలు ఖాళీ అయ్యాయి. శివసేన, అకాలీదళ్ దూరమైన కారణంగా వారి ప్లేస్‌లు కూడా భర్తీ కావల్సి ఉంది. ఐదు అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ ఖాళీలు భర్తీ చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, మంత్రుల పనితీరు ఆధారంగా శాఖల్లో మార్పులు, చేర్పుల జరగవచ్చని తెలుస్తోంది. మంచిపనితీరు కనబర్చినవారికి మరింత ప్రాధాన్యత కలిగిన శాఖలు అప్పగించే అవకాశం ఉంది. పనితీరు సరిగాలేదని భావించినవారికి అంతగా ప్రాధాన్యతలేని శాఖలు లేదా పూర్తిగా ఉద్వాసన పలికే అవకాశం లేకపోలేదని సమాచారం. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడంలో విఫలమైన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఉద్వాసన తప్పదని చర్చ నడుస్తోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో సభ్యులుగా ఉండే మంత్రుల శాఖలను మార్చకపోవచ్చని తెలుస్తోంది.

ఈ క్రమంలో కేబినెట్‌ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్‌డీఏ కూటమి నుంచి శివసేన, శిరోమణి అకాలీదళ్‌ వైదొలగడంతో రెండు కేంద్ర మంత్రి పదవులు, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, మరో కేంద్రమంత్రి సురేష్‌ అంగడి మృతితో మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా అయ్యాయి. ఆయాశాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. అదనపు భారంతో మంత్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేబినెట్‌ పునర్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వరుణ్‌ గాంధీ, జ్యోతిరాధిత్య సింధియాతో పాటు మరో ఇద్దరిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి : Cabinet meeting: నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ… టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధులు, ఐటీ పాలసీపై చర్చ