AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి.. ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మరణం..

Gas Cylinder Blast in Delhi: దేశ రాజధాని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ పేలింది. ఈ సంఘటనలో ఒకే కుటుంబంలోని

Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి.. ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మరణం..
Gas Cylinder Blast In Delhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 30, 2021 | 8:04 AM

Gas Cylinder Blast in Delhi: దేశ రాజధాని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ పేలింది. ఈ సంఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. రాజధానిలో షాహదరా ప్రాంతం ఫార్ష బజార్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో మంగళవారం అర్థరాత్రి గ్యాస్ సిలిండర్‌ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సిలిండర్ పేలుడు అనంతరం ఇంట్లో తీవ్రంగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పాట్‌కు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక సర్వీసుల శాఖ డైరెక్టర్ అతుల్ గార్గ్ పేర్కొన్నారు. మంటలు పక్క ఇళ్లల్లోకి వ్యాపించకుండా అరికట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Also Read:

CM Jagan Letter to PM: ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ.. ప్రైవేట్‌కు తగ్గించి ప్రభుత్వానికి వ్యాక్సిన్లను పెంచాలని విజ్ఞప్తి

Union Cabinet Expansion:తుది దశకు కేంద్ర కేబినెట్ విస్తరణ.. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో ప్రధాని భేటీ.. మంత్రుల పనితీరుపై సమీక్ష