AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP cabinet meeting: 9 నుంచి 12వ‌ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ల్యాప్ టాప్‌ల పంపిణీకి కేబినెట్ ఆమోదముద్ర

ఏపీ కేబినెట్ మీటింగ్‌లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీస‌కున్నారు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

AP cabinet meeting:  9 నుంచి 12వ‌ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ల్యాప్ టాప్‌ల పంపిణీకి కేబినెట్ ఆమోదముద్ర
CM YS Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 30, 2021 | 2:56 PM

ఏపీ కేబినెట్ మీటింగ్‌లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీస‌కున్నారు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నవరత్నాల్లో భాగంగా 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమానికి ప‌చ్చ‌జెండా ఊపింది. ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్పుకు గ్రీన్ సిగ్న‌ల్ లభించింది. జేఎన్‌టీయూ చట్టం 2008 సవరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి మంత్రివ‌ర్గం అంగీక‌రించింది. 2021-24 ఐటీ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూముల‌ రీసర్వేలో పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి ఏపీ భూహక్కు చట్ట సవరణకు ఆమోదం తెలిపింది కేబినెట్. విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్‌ సెజ్‌కు భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 81 ఎకరాల భూకేటాయింపునకు అంగీకారం తెలిపింది.

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న మ‌రికొన్ని నిర్ణ‌యాలు

  • విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు ఆమోదం
  • సత్యనారాయణ పురం, మాచవరం పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చేందుకు ఆమోదం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 వాహనాలను కొనుగోలుకు 90 కోట్ల మంజూరు కు ఆమోదం
  • రూ.864 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి పధకం లో పుట్టపర్తి నియోజక వర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు మొదటి దశ కింద ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారాన్ని తెలిపిన కేబినెట్

Also Read: Ys Sharmila: పొలిటిక‌ల్ డైలాగ్స్ పేల్చిన వైయ‌స్. ష‌ర్మిల‌.. రేవంత్ రెడ్డిపై కూడా అటాక్

 తెలంగాణ మంత్రుల కామెంట్స్‌కు.. తొలిసారి ఘాటుగా బ‌దులిచ్చిన ఏపీ మంత్రి బొత్స‌

అంపైర్‌ నిర్ణయాన్నే ప్రశ్నించిన ప్లేయర్.. కట్‌చేస్తే.
అంపైర్‌ నిర్ణయాన్నే ప్రశ్నించిన ప్లేయర్.. కట్‌చేస్తే.
TTD ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీగా విరాళాలు..రూ.2 కోట్లు అందజేత!
TTD ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీగా విరాళాలు..రూ.2 కోట్లు అందజేత!
IPL 2025: 4 గంటల్లో సూర్యకు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ..
IPL 2025: 4 గంటల్లో సూర్యకు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ..
భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి పాకిస్తాన్..! ఆ దేశాలతో రాయబారం
భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి పాకిస్తాన్..! ఆ దేశాలతో రాయబారం
మళ్లీ సాధారణ స్థితికి పహల్గామ్‌..పర్యాటకులు ఏమంటున్నారంటే!
మళ్లీ సాధారణ స్థితికి పహల్గామ్‌..పర్యాటకులు ఏమంటున్నారంటే!
విషవాయువుతో నిండిన బావిలో పడిన వ్యాన్‌.. 12 మంది మృత్యువాత..
విషవాయువుతో నిండిన బావిలో పడిన వ్యాన్‌.. 12 మంది మృత్యువాత..
కర్రెగుట్టల్లో తుపాకుల మోత.. సీఎం రేవంత్, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కర్రెగుట్టల్లో తుపాకుల మోత.. సీఎం రేవంత్, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Video: లైవ్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో గొడవకు దిగిన కింగ్ కోహ్లీ
Video: లైవ్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో గొడవకు దిగిన కింగ్ కోహ్లీ
తెలంగాణలో భానుడి భగభగలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్!
తెలంగాణలో భానుడి భగభగలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్!
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..