Gandhi Hospital : కొవిడ్ నోడల్‌ సెంటర్‌గా ఉన్న సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఇక అన్ని సేవలు అందుబాటులోకి.. !

కరోనా ఉధృతి నేపథ్యంలో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిని సెకండ్‌ వేవ్‌ లో కూడా కరోనా నోడల్ కేంద్రం గా..

Gandhi Hospital : కొవిడ్ నోడల్‌ సెంటర్‌గా ఉన్న సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఇక అన్ని సేవలు అందుబాటులోకి.. !
Gandhi Hospital
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 30, 2021 | 3:24 PM

Secunderabad Gandhi Hospital : కరోనా ఉధృతి నేపథ్యంలో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిని సెకండ్‌ వేవ్‌ లో కూడా కరోనా నోడల్ కేంద్రం గా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు సాధారణ సేవలకు సైతం అందుబాటులోకి తీసుకొస్తోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో తిరిగి నాన్ కొవిడ్ సేవలను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ గాంధీ ఆసుపత్రి పూర్తి స్థాయిలో బాధితులకు కరోనా ట్రీట్మెంట్ అందించగా.. మిగతా ప్రభుత్వ ఆసుపత్రులలో కొవిడ్ తో పాటు నాన్ కొవిడ్ సేవలను కూడా అందించింది వైద్య ఆరోగ్యశాఖ.

ఇప్పుడు, తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ గాంధీ ఆసుపత్రిలో జనరల్ ఒపి సేవలతోపాటు, మిగతా అన్ని రోగాలకు ట్రీట్మెంట్ ఇచ్చేలా అనుమతి ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా కేసులు తగ్గడంతో కరోనాతో పాటు జనరల్ ట్రీట్మెంట్ ను కూడా అందిస్తున్నారు.

మరో వారం రోజులో గాంధీ ఆసుపత్రి లో రెగ్యులర్ చికిత్స అందించనున్నామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి రమేష్ రెడ్డి చెప్పారు. తెలంగాణ లో ప్రస్తుతం రోజూ వేయికి తక్కువగా కరోనా కేసులు నమోదవ్వడం, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గడంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా