Monsoon Diseases: వర్షాకాలంలో జాగ్రత్త సుమీ.. పొంచివున్న వ్యాధులు.. వాటికి ఇలా చెక్ పెడదాం..!
వర్షాకాలంలో అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుంటాయి. కరోనా మహమ్మారి ఉన్న సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. జలుబు.. నుంచి మొదలు పెడితే శ్వాసకోశ వ్యాధుల వరకు అన్నీ..
వర్షాకాలంలో అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుంటాయి. కరోనా మహమ్మారి ఉన్న సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. జలుబు.. నుంచి మొదలు పెడితే శ్వాసకోశ వ్యాధుల వరకు అన్నీ ఈ కాలంలోనే త్వరగా విస్తరిస్తుంటాయి. వీటి వ్యాప్తికి సంబంధించిన సూక్ష్మజీవులు వర్షాకాలంలో బాగా వృద్ధి చెందడంతో అదే స్థాయిలో వ్యాధులూ సోకుతాయి. వాతావరణ మార్పుల వల్ల శరీరంలో కొన్ని రకాల మార్పులు వస్తుంటాయి. ఈ కాలంలో ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి మార్పులొచ్చినా తక్షణమే మేల్కోవడం అత్యవసరం. వర్షాకాలంలో వచ్చే వ్యాధులనుంచి వంటింటి చిట్కాలను తెలుసుకుందాం..
1. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం
వర్షాకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరంలు వస్తుంటాయి. పలు రకాల వైరస్‌ల వల్ల ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే.. ముందుగా మనం మన ఇంటితోపాటు చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వర్షంలో ఎక్కువగా తడవరాదు. అలాగే దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాల్లో గడపరాదు.
2. విష జ్వరాలు
వర్షాకాలం వచ్చిందంటే వెంటనే విష జ్వరాలు( మలేరియా, డెంగీ, టైఫాయిడ్) వస్తుంటాయి. ఇవి దోమలు కుట్టడం వల్ల మనకు వస్తాయి. అందువల్ల ఇంట్లో దోమల నుంచి రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. దోమ తెరలను వాడాలి. ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
3. కలరా
వర్షాకాలంలో ఎక్కవ నష్టాన్ని కలిగించేది కలరా… ఇది కలుషితమైన నీరు తాగడం, ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. ఎవరైనా ఇంట్లో లేదా బయట నీరు తాగేటప్పుడు, ఆహారం తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు, ఆహారం నాణ్యంగా ఉన్నాయని భావిస్తేనే వాటిని తీసుకోవడం మంచిది.
4. హెపటైటిస్ ఎ
కలుషితమైన ఆహారం తీసుకోవడం, నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. ఈ వ్యాధి వచ్చిన వారిలో లివర్‌పై బాగా ప్రభావం పడుతుంది. వారిలో జ్వరం, వాంతులు, ఒంటిపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.