Cholesterol Increase: అధిక కొలెస్ట్రాల్‌ ప్రమాదకరం.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలు ఇవే..!

Cholesterol Increase: ప్రస్తుతమున్న రోజుల్లో చాలా మందికి అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది. ఎందుకంటే ఏ అనారోగ్యమైనా, చిన్నదైనా లేదా పెద్దదైనా, మీ రోజువారీ జీవితాన్ని, మనస్సు ప్రశాంతతను తప్పక ప్రభావితం చేస్తాయి..

Cholesterol Increase: అధిక కొలెస్ట్రాల్‌ ప్రమాదకరం.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలు ఇవే..!
Cholesterol Increase
Follow us
Subhash Goud

|

Updated on: Jul 01, 2021 | 5:51 AM

Cholesterol Increase: ప్రస్తుతమున్న రోజుల్లో చాలా మందికి అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది. ఎందుకంటే ఏ అనారోగ్యమైనా, చిన్నదైనా లేదా పెద్దదైనా, మీ రోజువారీ జీవితాన్ని, మనస్సు ప్రశాంతతను తప్పక ప్రభావితం చేస్తాయి. ఈ కాలంలో ఈ జీవన విధాన వ్యాధి చాలా సాధారణం అయిపోయింది. మీ రక్తంలో సాధారణం కంటే అనారోగ్యకరమైన స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే, దాన్ని ‘అధిక కొలెస్ట్రాల్ స్థితి’ అంటారు. అది చాలా తీవ్రమైన సమస్య. తీవ్రమైన గుండెజబ్బులకు, స్థూలకాయం, ఇతర అలాంటి వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ ఒక ముఖ్య కారణం. ఆరోగ్యానికి ఈ కొలెస్ట్రాల్ బూస్టింగ్ ఫుడ్స్ చాలా అవసరం. జీవనవిధాన మార్పులు అంటే ఆరోగ్యకర డైట్, రోజువారీ వ్యాయామం, కొన్ని ముఖ్యమైన మందులు వాడకంతో అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. మీకు అధిక కొలెస్ట్రాల్ ఉంటే, ఈ కింది అనారోగ్యకర అలవాట్లను మానుకోవడం మంచిది.

ఆరోగ్యకర కొవ్వులకు దూరంగా ఉండటం

సాధారణంగా కొన్ని కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి మంచివైతే.. మరి కొన్ని చెడుకు దారి తీస్తాయి. శరీరానికి పనిచేయటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు అవసరమని అర్థం తెలుసుకోలేకపోతారు. అన్ని కొవ్వు పదార్థాలు అనారోగ్యకరమైనవి కావు. పిజ్జాలు, బర్గర్లలో ఉండే కొవ్వులు అనారోగ్యకరమైనవి. కానీ అవకాడోలు, నెయ్యి, కొబ్బరికాయలోవి ఆరోగ్యానికి మంచివి. అందుకని మీ డైట్ కి ఆరోగ్యకరమైన కొవ్వులను జతచేయటం వలన అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.

మాంసపు పదార్థాలు అధికంగా తినడం

మీరు మాంసాహారులైతే, దాదాపు ప్రతిరోజూ మాంసం వంటకాలు తినేవారైతే మీరు ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోమాంసం, పందిమాంసం వంటి మాంసాలు తినటం వలన కొలెస్ట్రాల్ మరింత పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీరు దాని బదులు సన్నని మాంసాలైన చికెన్, సముద్రపు ఆహారం వంటి ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోవడం మంచిది.

తక్కువ కాల్షియం డైట్

మన శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి, ముఖ్యంగా ఎముకలు, మెదడు సరిగ్గా ఎదగటానికి, కాల్షియం చాలా ముఖ్యమైన పోషక లవణం. అదనంగా, అనేక అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే కాల్షియం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించటంలో సాయపడుతుంది. అందుకని మీరు కాల్షియం ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు, పాల ఉత్పత్తులు, పాలకూర, గుడ్లు వంటివి తినకపోతే మీ కొలెస్ట్రాల్ సమస్య మరింత ముదిరే అవకాశం ఉంది.

బేకరీ ఆహార పదార్థాలు తినటం

కేకులు, తెల్ల బ్రెడ్ వంటి పదార్థాలను తినడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ బేకరీ ఉత్పత్తులు అధిక మొత్తాల్లో ఈస్ట్, పంచదార, ఇతర ప్రాసెస్డ్ పదార్థాలతో తయారు చేస్తారు. ఈ వాడే వస్తువులు మన ఆరోగ్యానికి చాలా హానికరమైనవిగా చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతుంటే వీటికి దూరంగా ఉండటం మంచిది.

తక్కువ పీచు పదార్థాలున్న డైట్ తినటం వలన

అవసరమైన పోషకాలు ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు, ఖనిజ లవణాలు వంటి వాటితో పాటు ఫైబర్ కూడా మనం సాధారణంగా ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఫైబర్‌ ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తనాళాల్లో పూత తయారవ్వకుండా తొలగిస్తుంది. అందుకని మీ డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే మొలకలు, పండ్లు, ఆకు కూరలు వంటివి ఉండే విధంంగా చూసుకోవాలి.

ఎక్కువగా మద్యపానం

మద్యం అలవాటు అనేది ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైపోయింది. కొందరికైతే మద్యం లేనిదే రోజు గడవదు. ఇది క్రమం తప్పకుండా తాగితే మన ఆరోగ్యానికి చాలా హానికరం. మానసిక సమస్యలే కాక, అది తీవ్రమైన శారీరక సమస్యలను కూడా తెస్తుంది. క్యాన్సర్ తో సహా ఆల్కహాల్ లో అనారోగ్యకర కొవ్వులు ఎక్కువగా ఉండటం వలన అది మీ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను మరింత పెంచివేస్తుంది. అందుకే మద్యానికి దూరంగా ఉండటం మంచిది.

బరువు తగ్గటం గురించి ఆలోచించకపోవటం

అధిక కొలెస్ట్రాల్, అధిక శరీర కొవ్వు వంటివి పలు వ్యాధులకు కారణమవుతాయి. అధిక కొలెస్ట్రాల్ బరువు పెరగటానికి కారణమైతే, బరువు పెరగటం కొలెస్ట్రాల్ పెరుగుదలకి కారణమవుతుంది. అందుకని మీ కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం మీరు బరువు, శరీరంలో కొవ్వు స్థాయి రెండూ తగ్గించుకోవడం మంచిది. కఠినమైన డైట్, వ్యాయామం వంటివి వైద్యుల సూచనలు, సలహాలు పాటించడం తప్పనిసరి.

మానసిక ఒత్తిడి

ప్రస్తుతమున్న రోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. దీని వల్ల తలనొప్పుల నుంచి, మానసిక ఒత్తిడి మరీ కాన్సర్ లాంటి భయంకర రోగాలకి కూడా కారణమవ్వచ్చు. అందుకని మానసిక ఒత్తిడిని అదుపులో పెట్టుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు.

ఇవీ కూాడా చదవండి:

Coronavirus: కరోనా ఎక్కడికీ పోదు..మామూలు ఫ్లూ వలె భావించాల్సిందే అంటున్న సింగపూర్..ఆంక్షలు సడలించిన దేశాలు ఇవే!

Corona Testing: మాస్క్ తో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు..శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ!

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా