Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves benefits: తినేప్పుడు కరవేపాకును పడేస్తున్నారా ? అయితే మీరు ఈ ప్రయోజనాలను తెలుసుకోవాల్సిందే…

మన భారతీయ వంటశాలలోని అనేక పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోపు దినుసుల నుంచి సువాసనకు అవసరమైన కరివేపాకుల వరకు అన్ని మన

Curry Leaves benefits: తినేప్పుడు కరవేపాకును పడేస్తున్నారా ? అయితే మీరు ఈ ప్రయోజనాలను తెలుసుకోవాల్సిందే...
Curry Leaves
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 01, 2021 | 11:21 AM

మన భారతీయ వంటశాలలోని అనేక పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోపు దినుసుల నుంచి సువాసనకు అవసరమైన కరివేపాకుల వరకు అన్ని మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే అందులో కొన్నింటిని తినే సమయంలో పక్కన పెట్టేస్తుంటాం. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలను మనం దూరం చేసుకన్నట్లే. అందులో ముఖ్యంగా కరివేపాకు. వంటకు రుచి, సువాసనకు మాత్రమే కాదు… ఆరోగ్యానికి పోషకాహారం కూడా. దీనిని పురాతన కాలం నుంచి మన వంటకాలలో ఉపయోగిస్తుంటారు. కరివేపాకుతో కలిగే ప్రయోజనాల గురించి ప్రముఖ నిపుణులు పూజా మఖిజా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

కరివేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ డైజెంటరీ, జీర్ణ, కార్మినేటివ్ లక్షణాలున్నాయి. అంతేకాకుండా.. ఇందులో తక్కువ కొలెస్ట్రాల్, మెరుగైన కంటిచూపు, రక్తహీనత తగ్గించే లక్షణాలు, గుండె ఆరోగ్యం, దంతాల ఆరోగ్యానికి కరివేపాకు ఉపయోగపడుతుంది.

కరివేపాకును ఎలా తీసుకోవాలి… 1. ఒక గ్లాసు కూరగాయల రసానికి 8-10 కరివేపాకులు వేసి రోజూ తాగాలి. ఇందులో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. యాంటీ ఆక్సిడెంట్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. మొటిమలను తగ్గించడంలోనూ సహయపడుతుంది. 2. ఈ ఆకులను ఎండలో ఆరబెట్టి.. పొడిగా చేసుకోవాలి. దానిని ఒక కూజాలో గాలి చోరబడకుండా.. భద్రంగా నిల్వచేయాలి. దీనిని 1/4 టీస్పూన్ ను గర్భధారణ సమయంలో అనారోగ్యం, వికారం తగ్గేందుకు సహాయపడుతుంది. 3. అంతేకాదు.. కరివేపాకు జుట్టు, చర్మం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్టాల్ ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

ట్వీట్..

Also Read: National Doctors Day-2021: డాక్టర్స్‌ డే ఎందుకు జరుపుకుంటారు..! దాని వెనకున్న చరిత్ర ఏంటి.. తెలుసుకోండి..

National Doctor’s Day: సాయి పల్లవి.. అజ్మల్ అమీర్‏ సహా నిజ జీవితంలో డాక్టర్స్ అయిన స్టార్స్..

Ravi Babu: అడల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న రవిబాబు.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్న క్రష్

Telangana Online Classes: తెలంగాణలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ క్లాసులు.. రోజుకు 50 శాతం సిబ్బంది రావాలన్న సర్కార్‌