National Doctor’s Day: సాయి పల్లవి.. అజ్మల్ అమీర్ సహా నిజ జీవితంలో డాక్టర్స్ అయిన స్టార్స్..
National Doctor's Day 2021: కరోనా సంక్షోభంలోనూ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వైరస్‌తో పోరాడుతున్నారు డాక్టర్స్. గత సంవత్సర కాలంగా ఇళ్లు..

National Doctor’s Day 2021: కరోనా సంక్షోభంలోనూ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వైరస్‌తో పోరాడుతున్నారు డాక్టర్స్. గత సంవత్సర కాలంగా ఇళ్లు.. ఆత్మీయులను వదిలి దూరంగా ప్రాణం తీసే మహమ్మారితో ధైర్యంగా పోరాడుతూ.. నిరంతరం శ్రమిస్తూ ఎంతో ప్రాణాలను కాపాడుతూనే ఉన్నారు. కరోనా వారియర్స్‌గా విశ్రాంతి లేకుండా పోరాడుతున్న డాక్టర్స్ కు ధన్యవాదలు చెప్పాల్సిన రోజు. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ సందర్భంగా.. రీల్ లైఫ్ లో కాకుండా నిజ జీవితంలో డాక్టర్స్ అయిన స్టార్స్ ఎవరో తెలుసుకుందామా.
సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి.. తన డ్యాన్స్, సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజానికి సాయిపల్లవి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. నిజ జీవితంలో డాక్టర్ కూడా. ఇటు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కానీ.. సాయి పల్లవి తన విద్యాబ్యాసం ఆపలేదు. జార్జియాలోని తబలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి 2016లో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. గత ఏడాది తిరుచ్చిలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ కు హాజరైంది. కార్డియాలజిస్ట్ కావాలన్నది సాయి పల్లవి కల అని పలు సందర్భాల్లో చెప్పింది.
రూపా.. ఉమా మహేశ్వర ఉగ్రహరూపస్య సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యింది రూపా. డాక్టర్ అవ్వాలని చిన్ననాటి నుంచి కలలు కంటుందట. గుంటూరు కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో హౌజ్ సర్జన్ పూర్తిచేసింది. ఇటు పలు సినిమాలు చేస్తూ.. కరోనా బాధితులకు వైద్యం అందిస్తుంది రూపా.
అజ్మల్ అమీర్.. రంగం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు అజ్మల్ అమీర్. నెగిటవ్ షెడ్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న అజ్మల్ అమీర్.. నిజ జీవితంలో డాక్టర్. ఉక్రెయిన్ లోని నేషనల్ పిరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య అధ్యయనాలు పూర్తిచేశారు.
భరత్ రెడ్డి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ రెడ్డి నిజ జీవితంలో డాక్టర్. అర్మేనియాలోని యెరెవాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి వైద్య పట్టా పూర్తి చేశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో కార్డియాలజీ స్పెషలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు భరత్ రెడ్డి.
వీరితో పాటు నటుడు రాజశేఖర్, ఆయన కూతురు శివాత్మిక, మాధాల రవి (దివంగత), రవి ప్రకాశ్‌లు కూడా యాక్టర్లుగా మారిన డాక్టర్లే.