Ravi Babu: అడల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న రవిబాబు.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్న క్రష్
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు రవిబాబు. మొదటి నుంచి రవిబాబు సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.కామెడీ పరంగా నైనా హారర్ నేపథ్యంలో సినిమాలైన రవిబాబు తనదైన స్టైల్ లో తెరకెక్కించి ఆకట్టుకుంటారు.
Ravi Babu: డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు రవిబాబు. మొదటి నుంచి రవిబాబు సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.కామెడీ పరంగా నైనా హారర్ నేపథ్యంలో సినిమాలైన రవిబాబు తనదైన స్టైల్ లో తెరకెక్కించి ఆకట్టుకుంటారు. ఇప్పుడు అడల్ట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ”క్రష్” అనే యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు రవిబాబు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టాడు డైరెక్టర్ రవిబాబు. తన హోమ్ బ్యానర్ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పైనే ఈ చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆవార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ ఆ పోస్టర్ ను రిలీజ్ చేసింది. జీ5 ఓటీటీలో ‘క్రష్’ సినిమాని జులై 9వ తేదీన స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా మరో అడల్ట్ పోస్టర్ ని వదిలారు.ఈ చిత్రంలో అభయ్ సింహా – కృష్ణ బూరుగుల – చరణ్ సాయి – అంకిత మనోజ్ – పర్రీ పాండే – శ్రీ సుధారెడ్డి నటిస్తున్నారు.
Ravi Babu’s #Crrush to have direct OTT release on ZEE5 on 9th July pic.twitter.com/VUAktUEYJy
— Movie Mahal (@moviemahaloffl) July 1, 2021
మరిన్ని ఇక్కడ చదవండి: