Ajith Kumar : ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాకుండా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న అజిత్ సినిమా..
తల అజిత్ నటిస్తున్న తాజా చిత్రం వలిమై. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తమిళ్ హీరోల్లో అజిత్ ఒకరు. ఈ స్టార్ హీరో నటించిన సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.
Ajith Kumar : తల అజిత్ నటిస్తున్న తాజా చిత్రం వలిమై. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తమిళ్ హీరోల్లో అజిత్ ఒకరు. ఈ స్టార్ హీరో నటించిన సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అజిత్ నటించిన సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతున్నాయి. ఇక హెచ్.వినోద్ దర్శకత్వంలోనే అజిత్ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ .ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ కు సిద్దమా అవుతున్నరు వాలిమై టీమ్.
కనీసం ఫస్ట్ లుక్ రిలీజ్ కాకుండా అనేది తమిళ స్టార్ హీరో తలా అజిత్ సినిమాకు ఇప్పుడు ఓ అరుదైన రికార్డ్ దక్కింది. గతేడాది కాలంగా వాలిమై చిత్రం నుండి ఎలాంటి అప్డేట్స్ లేవు. దాంతో మేకర్స్ పైన అజిత్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవలే విదేశాల్లో క్రికెట్ గ్రౌండ్లో కూడా వాలిమై అప్డేట్ కావాలంటూ డిమాండ్ చేశారు. ఇంతకు అజిత్ సినిమాకు దక్కిన అరుదైన గౌరవం ఏంటో తెలుసా.. బుక్ మై షో ఇంటరెస్ట్ లో వాలిమై సినిమా 1మిలియన్ రికార్డు దాటింది. ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ లేకుండా సినిమా ఈ రేంజిలో ఇంటరెస్ట్ నమోదు చేయడం విశేషం ఇప్పటివరకు ఈ రికార్డ్ తెలుగు సినిమా బాహుబలి పేరుమీద ఉంది.ఇప్పుడు ఆ రికార్డు ను అజిత్ సినిమా బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా రీలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి: