Akhil Akkineni: శ్రీను వైట్ల డైరెక్షన్ లో అక్కినేని యంగ్ హీరో సినిమా.. మరి ఈసారైనా హిట్ పడేనా..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేక పోయాయి. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో చేసాడు అఖిల్.

Akhil Akkineni: శ్రీను వైట్ల డైరెక్షన్ లో అక్కినేని యంగ్ హీరో సినిమా.. మరి ఈసారైనా హిట్ పడేనా..
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 01, 2021 | 8:41 AM

Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేక పోయాయి. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో చేసాడు అఖిల్. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. అలాగే ఈసినిమా తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘హలో’ అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా ఫట్ మంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా పై అఖిల్ తోపాటు అక్కినేని అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలను సినిమా అందుకోలేక పోయింది. ఇక ఇప్పడు అఖిల్ స్పీడ్ పెంచాడు. వరుస గా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో అఖిలుల్ కు జోడీగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ‘ఏజెంట్’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. ఒకప్పుడు సూపర్ హిట్లతో దూసుకుపోయిన శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తుంది. శ్రీను వైట్ల చెప్పిన కథ మైత్రీవారికి నచ్చిందని , త్వరలోనే అఖిల్ కు కథను వినిపించనున్నారని అంటున్నారు. మైత్రీ మేకర్స్ ఆల్రెడీ అఖిల్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారనీ .. ఈ ప్రాజెక్టు ఆయన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరో వైపు శ్రీను వైట్ల మంచు విష్ణు తో ‘ఢీ’ సీక్వెల్ చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Actor Naseeruddin Shah: తీవ్ర అస్వస్థతకు గురైన బాలీవుడ్ యాక్టర్ నసీరుద్దీన్ షా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు..

Trinadha Rao Nakkina : ఆ రెండు సినిమాలు ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన

Mahesh Babu-Rajamouli : మహేష్ తో జక్కన మాస్టర్ ప్లాన్.. సూపర్ స్టార్ తో రాజమౌళి అలాంటి స్టోరీ చేయబోతున్నారా..?

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?