Ranveer Singh: రణ్‏వీర్ సింగ్ న్యూలుక్ ఫోటోషూట్ వైరల్… మీమ్స్‏తో ఆటడేసుకుంటున్న నెటిజన్లు..

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరోలలో రణ్‏వీర్ సింగ్ సింగ్ ఒకరు. కేవలం నటనతోనే కాకుండా.. లెటేస్ట్ ఫ్యాషన్ పోకడలను అనుసరిస్తూ..

Ranveer Singh: రణ్‏వీర్ సింగ్ న్యూలుక్ ఫోటోషూట్ వైరల్... మీమ్స్‏తో ఆటడేసుకుంటున్న నెటిజన్లు..
Ranveer Singh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 01, 2021 | 9:53 AM

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరోలలో రణ్‏వీర్ సింగ్ సింగ్ ఒకరు. కేవలం నటనతోనే కాకుండా.. లెటేస్ట్ ఫ్యాషన్ పోకడలను అనుసరిస్తూ.. ఎప్పటికప్పుడూ కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించడంలో ముందుంటాడు ఈ బాలీవుడ్ హీరో. చాలా సందర్భాల్లో రణ్‏వీర్ సింగ్ ప్రత్యేకమైన ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అందులో ముఖ్యంగా హిజ్రా తరహా గెటప్పులలో కనిపించి తన ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేశాడు. తాజాగా మరోసారి ఢిఫరెంట్ గెటప్ లో కనిపించి షాకిచ్చాడు రణ్‏వీర్ సింగ్.

టాప్ టూ బాటప్ బ్లూకలర్ బూచీ డ్రెస్‏తోపాటు.. ఒంటి నిండా బంగారు నగలతో.. పొడవైన జుట్టుతో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక రణ్‏వీర్ సింగ్ న్యూలుక్ ఫోటోస్ రివీల్ కాగానే సోషల్ మీడియా మీమ్స్‏తో షేకైంది. రణ్‏వీర్ నయా లుక్ ఫోటోస్ తో ఇంటర్నెట్ అల్లాడింది. ఈ న్యూలుక్ ను రణ్‏వీర్ ప్రముఖ గూచీ క్రియేటివ్ డైరెక్టర్ అలెశాండ్రో మిచెల్ కు అంకితం చేశాడు. ఈ గూచీ స్టైల్లో 1961 నాటి హ్యాండ్ బ్యా్గ్ స్లైల్ ఉపయోగించుకున్నారట.

ఇక రణ్‏వీర్ సింగ్ న్యూలుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రణ్‏వీర్ విచిత్రమైన ఫోటోలతో నెట్టింట్లో మీమ్స్ ఫెస్ట్ జరుగుతోంది. రణ్‏వీర్ 21వ శతాబ్ధపు అల్లావుద్దీన్ ఖిల్జీ వెర్షన్ ను గుర్తుచేశాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు నిజంగానే మీరు యునికార్స్ కాదా ? అని.. మరికొందరు జీసస్ మోడ్రన్ వెర్షన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రణ్‏వీర్ సింగ్ 83 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ పాత్రను పోషిస్తున్నాడు రణ్‏వీర్.

ట్వీట్..

మీమ్స్..

Also Read: Ajith Kumar : ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాకుండా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న అజిత్ సినిమా..

Abhimanyu Mishra : 12 ఏళ్లకే చెస్‌లో గ్రాండ్ మాస్టర్ అయిన అభిమన్యు మిశ్రా.. అతి చిన్న వయస్కుడిగా గుర్తింపు..

Tollywood Celebrites birthdays: సోనూసూద్, కళ్యాణ్ రామ్, కృతి సనన్‏తోపాటు జూలైలో పుట్టిన రోజు జరుపుకుంటున్న సెలబ్రెటీలు వీళ్లే…