Telangana Online Classes: తెలంగాణలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ క్లాసులు.. రోజుకు 50 శాతం సిబ్బంది రావాలన్న సర్కార్‌

ఇవాళ్టి నుంచి కేజీ టు పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.

Telangana Online Classes: తెలంగాణలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ క్లాసులు.. రోజుకు 50 శాతం సిబ్బంది రావాలన్న సర్కార్‌
Follow us

|

Updated on: Jul 01, 2021 | 10:09 AM

తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఇవాళ్టి నుంచి కేజీ టు పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. 2021-22 సంవత్సరానికిగాను 3వ తరగతి నుంచి 10 తరగతి వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. పాఠ్యంశాల వివరాలు… టైంటేబుల్‌ను విడుదల చేసింది. విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు అన్ని విధాలుగా రెడీగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదిలావుంటే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మండల విద్యాధికారులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠ్యాంశాలను తరగతి వారీగా విద్యార్థులు చూసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు  ఆదేశాలు జారీ చేసింది.

తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణలో పాటించాల్సిన సూచనలను క్రమం తప్పకుండా పాటించేలా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు. తరగతుల వారీగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుంటారు. విద్యార్థులు పాఠాలు వినేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాంది రాష్ట్ర విద్యా శాఖ.

ఇవి కూడా చదవండి: Anti-Drone System: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌‌కు చెక్.. ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లు

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో వరంగల్ చాయ్ వాలా

Latest Articles
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..