Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ కు ద్యుతి చంద్, శ్రీహరి అర్హత; బోపన్న – దివిజ్ దూరం!

ఈ నెలలో ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీలు.. ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఇందులో భారత్ నుంచి దాదాపు 100 మందికిపైగా అథ్లెట్లు పాల్గొనబోతున్నారు.

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ కు ద్యుతి చంద్, శ్రీహరి అర్హత; బోపన్న - దివిజ్ దూరం!
Tokyo Olympics
Follow us
Venkata Chari

|

Updated on: Jul 01, 2021 | 8:57 AM

Tokyo Olympics: ఈ నెలలో ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీలు.. ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఇందులో భారత్ నుంచి దాదాపు 100 మందికిపైగా అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. తాజాగా ఈ పోటీలకు స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్, స్విమ్మర్ శ్రీహరి అర్హత సాధించారు. కాగా, టెన్నిస్ ప్లేయర్స్ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ జోడీ మాత్రం అర్హత సాధించలేకపోయారు. ద్యుతి చంద్‌ ప్రపంచ ర్యాంకింగ్‌ ఆధారంగా టోక్యో ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించింది. పటియాలాలో జరుగుతున్న అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్న ద్యుతి.. 100 మీ ఫైనల్స్ లో నాలుగో స్థానంలో నిలవడంతో ఒలింపిక్స్ కు నేరుగా క్వాలిఫై కాలేకపోయింది. అయితే, ర్యాంకుల ఆధారంగా అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్‌ కోటాలో 100 మీ పరుగులో 22 స్థానాలు, 200 మీ పరుగులో 15 బెర్తులు ఉన్నాయి. 100 మీ.లలో 44వ, 200 మీ.లలో 51వ స్థానంలో ఉన్న ఈ స్టార్ స్ప్రింటర్ కు చోటు లభించడంతో ఊపిరి పీల్చుకుంది. కాగా, మరోవైపు స్టార్‌ అథ్లెట్‌ హిమ దాస్‌ ర్యాంకింగ్‌ కోటాలోనూ చోటు సాధించలేకపోయింది. అర్హత పోటీల్లో భాగంగా ఇండియా గ్రాండ్‌ప్రిక్స్‌లో పాల్గొని 200 మీ పరుగును 22.88 సెకన్లలో పూర్తిచేసింది హిమ. కేవలం 00.08 సెకన్ల తేడాతో ఒలింపిక్స్‌ బెర్తును కోల్పోయింది. మరోవైపు భారత్‌ నుంచి తొలిసారి ఇద్దరు స్విమ్మర్లు టొక్యో ఒలింపిక్స్‌ లో ఆడనున్నారు. 200 మీటర్ల బటర్‌ఫ్లై పోటీల్లో సాజన్‌ ప్రకాశ్‌ ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ లో అర్హత సాధించగా, తాజాగా శ్రీహరి నటరాజ్‌ 100 మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌ పోటీల్లో గెలిచి నేరుగా ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించాడు. ఇటలీలో జరిగిన సెట్టె కోలీ ట్రోఫీలో 100 మీటర్ల పోటీల్లో శ్రీహరి ఎ- అర్హత ప్రమాణాన్ని అందుకున్నాడు. ఈమేరకు ఫినా బుధవారం ఓ ప్రకటన చేసింది. ఈ ట్రోఫీలో శ్రీహరి 53.77 సెకన్లతో లక్ష్యాన్ని పూర్తి చేసి అర్హత సాధించాడు. ఈమేరకు భారత్ నుంచి ఇద్దరు స్విమ్మర్లు బరిలోకి దిగనున్నారని ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది.

బోపన్న- దివిజ్‌ దూరం! పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న- దివిజ్‌ శరణ్‌ జోడీ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారు. బోపన్న 38వ ర్యాంకుతో ఉండగా, దివిజ్‌ 75 వ ర్యాంకుతో నిలిచాడు. దీంతో వీరి జోడీ ర్యాంకు 113 గా లెక్కించారు. దీంతో వీరి జోడీ టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే అర్హత సాధించలేకపోయారని ఐటీఎఫ్ పేర్కొంద. అయితే, ఒలింపిక్స్ లో పోటీకి అప్లై చేసుకున్న వారిలో విత్ డ్రా అయితే వీరకి అవకాశం ఉండొచ్చు. అయితే విత్ డ్రాలు భారీగా జరిగాల్సి ఉంటుంది. జులై 16 వరకు వేచి చూస్తే తప్ప మరిన్ని వివరాలు తెలుస్తాయని ఐటీఎఫ్ వెల్లడించింది. కాగా, టోక్యోకు బోపన్న వెళ్లకపోతే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్ స్టార్ సానియా మీర్జాతో ఆడే అవకాశం కూడా కోల్పోనున్నాడు. ఒలింపిక్ రూల్స్ ప్రకారం సింగిల్స్‌ లేదా డబుల్స్‌లో ఉన్నవారే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జోడీగా బరిలోకి దిగాలి. ఈమేరకు బోపన్నకు ఈ అవకాశం కూడా చేజారినట్లేనని తెలుస్తోంది.

Also Read:

T20 Revenge: బ్రాత్ వైట్ పై ఐదేళ్ల నాటి పగ తీర్చుకున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్..!

Wimbledon 2021 Day 3 Highlights: సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్, సబలెంకా ముందడుగు; కెనిన్, అండ్రస్కూ, బెన్ చిచ్ ఓటమి

Saina Nehwal: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ నెమలితో చెలిమి.. వైరల్ అయిన వీడియో