Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad FootBall Club: డానిష్ బ్రాండ్ తో హైదరాబాద్ ఎఫ్‌సీ ఒప్పందం; హెచ్‌ఎఫ్‌సీ కిట్ స్పాన్సర్‌గా హమ్మెల్!

ఇండియన్ సూపర్ లీగ్ లో ఆడే హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ జట్టుత గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్ హమ్మెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి హైదరాబాద్ ఎఫ్‌సీ టీంకి అఫిసీయల్ కిట్ పార్టనర్‌గా ఉండనుంది.

Hyderabad FootBall Club: డానిష్ బ్రాండ్ తో హైదరాబాద్ ఎఫ్‌సీ ఒప్పందం; హెచ్‌ఎఫ్‌సీ కిట్ స్పాన్సర్‌గా హమ్మెల్!
Hyderabad Football Club And Hummel
Follow us
Venkata Chari

|

Updated on: Jul 01, 2021 | 5:55 PM

Hyderabad FC: ఇండియన్ సూపర్ లీగ్ లో ఆడే హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ జట్టుతో గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్ హమ్మెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి హైదరాబాద్ ఎఫ్‌సీ టీంకి అఫిసీయల్ కిట్ పార్టనర్‌గా ఉండనుంది. ఈ ఒప్పందంతో డానిష్ స్పోర్ట్స్ బ్రాండ్ అయిన హమ్మెల్.. హైదరాబాద్ ఎఫ్‌సీ టీంతో ఇండియన్ సూపర్ లీగ్‌లోకి ఎంటరైంది. ఈమేరకు ఇండియన్ ఫుట్‌బాల్ లో పెట్టుబడులు పెట్టేందుకు, అలాగే ఇండియాలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హమ్మెల్.. ఎట్టకేలకు హైదరాబాద్ ఎఫ్‌సీ తో జట్టుకట్టింది. ఇండియన్ సూపర్ లీగ్ రాబోయే సీజన్ 2021-22 లో హైదరాబాద్ ఎఫ్‌సీ టీంకి అధికారిక కిట్ భాగస్వామిగా వ్యవహరించనుంది. ఐఎస్ఎల్ ఏడవ సీజన్లో ఓ ఎంటర్‌టైన్మెంట్ బ్రాండ్ తో జట్టు కట్టిన హైదరాబాద్ ఎఫ్‌సీ.. ఎనిమిదవ సీజన్ కోసం హమ్మెల్ తో జతకట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్, హ్యాండ్ బాల్‌ జట్లతో పనిచేస్తున్న హమ్మెల్.. స్పోర్ట్స్ బ్రాండ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. గతంలో రియల్ మాడ్రిడ్, టోటెన్‌హామ్ హాట్స్పుర్, ఆస్టన్ విల్లా, బెంఫికా, డెన్మార్క్ జట్లతో పనిచేసింది. ప్రస్తుతం ఐఎస్‌ఎల్ లో అగ్రశ్రేణి టీం హైదరాబాద్ ఎదిగింది. ఈమేరకు హమ్మెల్ హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టుతో జతకట్టినట్లు హమ్మెల్ ఇండియా ఎస్‌ఈఏ డైరెక్టర్ సౌమవ నాస్కర్ తెలిపారు. అలాగే ఫుట్‌బాల్ మా బ్రాండ్ డీఎన్‌ఏ లోనే ఉందని, అందుకే ప్రపంచ వ్యాప్తంగా అగ్రశ్రేణి జట్లతో కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

హైదరాబాద్ ఎఫ్‌సీ కో ఫౌండర్ వరుణ్ త్రిపురనేని మాట్లాడుతూ “యువతపై దృష్టి సారించి హెచ్‌ఎఫ్‌సీని ఒక ప్రత్యేకమైన క్లబ్‌గా తీర్చిదిద్దాం. గత సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన హెచ్‌ఎఫ్‌సీ.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలమైంది. అలాగే ఈ బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని ఆశిస్తున్నామని” అన్నారు.

Also Read:

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఎడమచేతి వాటం ఓపెనర్

Michael Vaughan: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ వక్రబుద్ధి; కోహ్లీపై మరోసారి..! ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్